అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ పునరుద్ధరణపై కీలక వ్యాఖ్యలు చేశారు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.ట్విట్టర్ కొనుగోలు పూర్తయ్యాక అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ట్విట్టర్ విధించిన నిషేధాన్ని ఎత్తేస్తానని మస్క్ ప్రకటించారు.
ఫైనాన్షియల్ టైమ్స్ ఫ్యూచర్ ఆఫ్ ది కార్ కాన్ఫరెన్స్‌లో మస్క్ ఈ విషయాన్ని చెప్పారు.శాశ్వతంగా నిషేధం విధించటం తప్పుడు నిర్ణయమని, అది ట్విట్టర్‌పై విశ్వాసాన్ని తగ్గిస్తుందన్నారు.
అమెరికా పార్లమెంట్‌పై దాడికి కారణమయ్యేలా ఆయన మద్దతుదారులనుద్దేశిస్తూ నాడు విద్వేష ప్రసంగం ఆరోపణలపై 2021 జనవరిలో ట్రంప్ ఖాతాపై ట్విట్టర్ శాశ్వత నిషేధం విధించడం తెల్సిందే.కాగా, ఎలోన్ మస్క్ మాట్లాడుతూ.‘శాశ్వత నిషేధాలు చాలా అరుదుగా ఉండాలి.తప్పుడు, చెడు ట్వీట్లు ఉంటే.
వాటిని తొలగించటం లేదా కనిపించకుండా చేయటం వంటి చర్యలు తీసుకోవాలి.స్కామ్‌లు లేదా స్పామ్ అకౌంట్ లకు ఇది వర్తింపజేయాలి.
డోనాల్డ్ ట్రంప్‌పై నిషేధం విధించడం సరికాదని నేను భావిస్తున్నాను.శాశ్వత నిషేధాన్ని తొలగిస్తాను.
అని మస్క్ తెలిపారు.ఆ సమయంలో, ట్రంప్‌కు ట్విట్టర్‌లో 80 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

ఈ క్రమంలోనే ట్విట్టర్‌ను కొనుగోలు చేయాలని మస్క్‌కు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారని వార్తలు వచ్చాయి.అయితే, ఈ వ్యాఖ్యలను మస్క్ ఖండించారు.ఈ విషయంపై తానెప్పుడూ ట్రంప్‌తో మాట్లాడలేదని స్పష్టం చేశారు.ట్రంప్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా గానీ తానెప్పుడూ మాట్లాడలేదన్నారు.ఇదిలా ఉంటే.మాజీ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తాను ట్విట్టర్‌కి తిరిగి వెళ్లననీ, గత కొన్ని వారాల్లో ట్రూత్ సోషల్ లో యాక్టివ్‌గా ఉంటున్నానని, ఈ వేదికపైకి రావడానికి చాలా మంది ముందుకొచ్చారని.
తనకు ఎలోన్ మస్క్ అంటే ఇష్టమని, కానీ ట్విట్టర్ తనతో వ్యవహరించిన తీరు పట్ల నిరాశ చెందానని.ట్విట్టర్‌లోకి తిరిగి రానని తెలిపారు.







