ఎలక్ట్రిక్ వెహికల్స్( Electric Vehicles ) కొనాలని ఉన్నా కొన్ని రిస్కులు చాలా మందిని మరోసారి ఆలోచింపజేస్తున్నాయి.వాటిలో ఒకటి అగ్నిప్రమాదాలు.
మన దేశంలో గత కొద్ది నెలల సమయంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్లు అగ్ని ప్రమాదాలకు గురై బూడిదయ్యాయి.వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ కూడా అయి కొనుగోనుదారుల్లో ఆందోళనలు పెంచేసాయి.
తాజాగా ఇలాంటి మరో సంఘటన చోటుచేసుకుంది.దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.
వివరాల్లోకి వెళితే, బెంగళూరులోని జేపీ నగర్‌లో( JP Nagar, Bangalore ) శనివారం మార్గమధ్యంలో ఓ ఎలక్ట్రిక్ కారు మంటల్లో చిక్కుకుంది.ఈ అగ్నిప్రమాదంలో ఎవరూ గాయపడలేదు, దీనికి కారణం ఇంకా తెలియరాలేదు.ఎగిసిపడుతున్న మంటల్లో కారు దగ్ధమైన దృశ్యాలు ట్విట్టర్‌లో వైరల్‌గా మారాయి.2023, ఏప్రిల్ నెలలో, పూణేలో టాటా నెక్సాన్ EV ( Tata Nexon EV )మంటల్లో రేగాయి.ఎవరూ గాయపడలేదు, కానీ కారు ధ్వంసమైంది.అనధికార వర్క్‌షాప్‌లో ఒరిజినల్ హెడ్‌ల్యాంప్‌ను మార్చడం వల్ల మంటలు చెలరేగాయని దర్యాప్తులో తేలింది.
2022, జూన్‌లో కూడా వసాయ్ వెస్ట్‌లోని పంచవటి హోటల్ సమీపంలో టాటా నెక్సాన్ EV అగ్ని ప్రమాదానికి గురైంది.అదృష్టం కొద్దీ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు, అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.ఈ ఘటనపై టాటా మోటార్స్ దర్యాప్తు చేస్తోంది.
తక్కువ స్థలంలో ఎక్కువ శక్తిని స్టోరేజ్ చేసే బ్యాటరీలు ఉండటం వల్ల ఎలక్ట్రిక్ వాహనాలకు మంటలు అంటుకుంటాయి.బ్యాటరీ డ్యామేజ్ అయినట్లయితే, అది థర్మల్ రన్‌అవే అనే చైన్ రియాక్షన్‌కు కారణమవుతుంది, ఇది బ్యాటరీ వెదజల్లే దానికంటే ఎక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది.దీని వల్ల బ్యాటరీ మంటలు చెలరేగవచ్చు.
ఈవీలు నడుపుతున్నప్పుడు లేదా పార్క్ చేస్తున్నప్పుడు మంటలు అంటుకోవచ్చు.ఇలాంటి ఘటనల్లో ప్రాణాలు పోయే ప్రమాదముంది.
అందుకే కంపెనీలు తమ కస్టమర్లు, ప్రజల భద్రతను నిర్ధారించడానికి మరిన్ని చర్యలు తీసుకోవాలి.ఈవీ మార్కెట్‌పై ఆధిపత్యం చెలాయించే రేసులో వారు భద్రత కంటే వేగానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు.