అంతుచిక్కని వ్యూహాలతో ప్రతిపక్షాలను తికమక పెట్టి పై చేయి సాధించాలనే ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ అధినేత ,ఏపీ సీఎం జగన్( AP CM Jagan ).సార్వత్రిక ఎన్నికలకు ఏడాది సమయం ఉన్నా, జగన్ మాత్రం ఎన్నికల వ్యూహాల్లో మునిగితేలుతున్నారు.
పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులను అలర్ట్ చేస్తున్నారు.పనితీరు మెరుగుపరుచుకోవాలని హెచ్చరికలు చేస్తున్నారు.
వివిధ కార్యక్రమాలు రూపొందించి నిత్యం పార్టీ నాయకులంతా జనాల్లో ఉండే విధంగా జగన్ ప్లాన్ చేస్తున్నారు.అయితే ఇదంతా ముందస్తు ఎన్నికల కోసమే అని ప్రతిపక్షాలు అనుమానిస్తూ, తమ పార్టీ నాయకులను అలెర్ట్ చేస్తున్నాయి.
అయినా జగన్ మాత్రం ముందస్తు ఎన్నికలపై ఏ ప్రకటన చేయడం లేదు.ఇది ఇలా ఉంటే అకస్మాత్తుగా జగన్ ఢిల్లీ టూర్ కి వెళుతున్నారు.
ఈ పర్యటనలో రాష్ట్ర విభజనలో భాగంగా ఏపీకి రావలసిన నిధులు, ప్రత్యేక హోదా, ఇతర పెండింగ్ అంశాల గురించి కేంద్ర బిజెపి( BJP ) పెద్దలతో చర్చించనున్నారు.
అలాగే వీటితో పాటు, మరో కీలక అంశం పైన జగన్ బిజెపి పెద్దలతో పాటు, ఎన్నికల కమిషన్ అధికారులతో చర్చించే అవకాశం ఉన్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది.
అయితే ముందస్తు ఎన్నికలు జరిగినా, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగినా, గెలుపు వైసిపి ( YCP )ఖాతాలోనే పడుతుందనే నమ్మకంతో ఉన్న జగన్, ఎన్నికలు ఒకే దశలో కాకుండా, వివిధ దశల్లో జరిగితే మంచిదనే అభిప్రాయంతో ఉన్నారట.ఓకే దశలో ఎన్నికలు జరిగితే పోల్ మేనేజ్మెంట్ చేయడం కష్టమవుతుందని, ఎక్కువ దశల్లో ఎన్నికలు జరిగితే గెలుపు అవకాశాలు మరింతగా మెరుగవుతాయని జగన్ అంచనా వేస్తున్నారట.

అందుకే వీలైతే 7 దశల్లో ఎన్నికలు నిర్వహించే విధంగా, కేంద్ర ఎన్నికల సంఘం సహకారం ఉండే విధంగా చూడాలని కేంద్ర బిజెపి పెద్దలను జగన్ కోరనున్నట్ట్టు సమాచారం.అందుకే జగన్ ఢిల్లీకి వెళ్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.గత ఏడాది గుజరాత్ లో రెండు దశల్లో, మణిపూర్(Manipur ) లో రెండు దశల్లో, ఉత్తర ప్రదేశ్ లో ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి.అలాగే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎనిమిది దశల్లో నిర్వహించారు.
అదేవిధంగా ఏపీలోనూ వివిధ దశలో ఎన్నికలు జరిగితే పోల్ మేనేజ్మెంట్ చేయడం సులువు అవుతుందని జగన్ భావిస్తున్నారట.

ఆయా రాష్ట్రాలతో పోలిస్తే, ఏపీలో పరిస్థితి సానుకూలంగానే ఉండడం ,నక్సలైట్ల ప్రభావం లేకపోవడం, అల్లర్లు జరిగే అవకాశం లేకపోవడం వల్ల ఎన్నికల కమిషన్ వివిధ దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అంగీకరించే పరిస్థితి ఉండదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.జగన్ మాత్రం ఈ విషయంలో బిజెపి పెద్దల సహకారం తీసుకుని వీలైనంత ఎక్కువ దశలో ఎన్నికలు ఏపీలో జరిగే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారట.







