తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాజకీయ వేడి పెరుగుతోంది.ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న నేతలు అందరూ వివిధ పార్టీలో చేరేందుకు సమాయత్తం అవుతున్నారు.
ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీల్లోకి మారుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నేత కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారని తెలుస్తోంది.
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి త్వరలోనే హస్తం గూటికి చేరతారనే వార్తలు జోరందుకున్నాయి.ఈ మేరకు తాజాగా సీతా దయాకర్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు.
కుటుంబ సభ్యులతో రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చిన సీతా దయాకర్ రెడ్డి భేటీ అయి ప్రస్తుత రాజకీయాలపై చర్చలు జరిపారని సమాచారం.