4వ రోజుకు చేరుకున్న ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం....

గుడివాడ( Gudivada ) పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం నాలుగో రోజుకు చేరుకుంది .పట్టణంలోని తొమ్మిదవ వార్డులో శనివారం ఎమ్మెల్యే నాని తన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

 Election Campaign Of Mla Kodali Nani Reached 4th Day ,mla Kodali Nani , Ycp, A-TeluguStop.com

ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానికు భీమేశ్వర స్వామి వారి దేవస్థానం వెనుక గేటు వద్ద వార్డు ఇంచార్జ్ జోగా కిషోర్ , వైఎస్ఆర్సిపి నాయకులు గజమాలలతో ఘన స్వాగతం పలికారు.శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం,జైన్ ప్రార్థనా మందిరాల్లో ఎమ్మెల్యే కొడాలి నాని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

అనంతరం జైన్ సత్రంలో ఎమ్మెల్యే నానితో సంఘ పెద్దలు సమావేశం అయ్యారు, జైన్ భవన్ నిర్మాణానికి సహకరించాలని సంఘ పెద్దలు ఎమ్మెల్యే నానికు విజ్ఞప్తి చేయగా… వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంఘీయులకు అనుకూలంగా ఉన్నచోట భవన నిర్మాణానికి సహకరిస్తానని ఎమ్మెల్యే నాని భరోసా ఇచ్చారు.అనంతరం ప్రచారంలో భాగంగా స్వర్ణకార చేతి వృత్తుదారులు తమ సమస్యలను ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురాగా, చేతి వృత్తుదారులను ప్రోత్సహించేలా జగనన్న ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

శ్రీనివాస సెంటర్ రిక్షా కార్మికులు ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యే నానిను కలిసి తమ సమస్యలు తెలియచేశారు,కార్మిక వర్గాలకు తాను అన్నివేళలా మద్దతుగా ఉంటానని, తనను కలిసిన కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే నాని హామీ ఇచ్చారు.

అనంతరం ప్రజలకు అభివాదం చేస్తూ పాదయాత్రగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కొడాలి నానికు, వీధి వీధినా మంగళ హారతులతో మహిళా సోదరీమణులు స్వాగతం పలికారు.

వివిధ వర్గాల ప్రజానీకంతో మమేకమవుతు ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే నానీకు వివిధ రూపాల్లో ప్రజానీకం తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే నానిను తమ ఇళ్లలోకి ఆహ్వానిస్తూ ఆత్మీయ ఆతిథ్యం ఇస్తున్నారు.

వీధి వీధినా పూల మాలలు, శాలువాలతో ఎమ్మెల్యే నానీకు ప్రజానీకం స్వాగతం పలుకుతున్నారు.పలు ప్రాంతాల్లో అబివాదాలు చేస్తున్న చిన్నారులతో ఎమ్మెల్యే కొడాలి నాని ముచ్చటించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ శివారు ప్రాంతాల్లో పెరుగుతున్న అపార్ట్మెంట్ కల్చర్, టిడ్కో కాలనీ నిర్మాణం దృష్ట్యా గుడివాడకు నలు దిక్కులా ఉన్న వలివర్తిపాడు , బొమ్ములూరు, బిళ్ళపాడు, మల్లాయిపాలెం, భూషణ గుల్ల గ్రామాలను గుడివాడ పురపాలక సంఘంలో విలీనం చేసేలా అసెంబ్లీలో చట్టం తీసుకువస్తే, మాజీ ఎమ్మెల్యే రావి, గుడివాడ టిడిపి అధ్యక్షులు రాంబాబు, రమేష్ చౌదరి కోర్టులకు వెళ్లి గ్రామాలు విలీనం కాకుండా అడ్డుకున్నారన్నారు.విరు చేసిన పనుల వల్ల గుడివాడ పురపాల సంఘ ఎన్నికలు నిలిచిపోవడమే కాక, ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఎమ్మెల్యే నాని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, మాకు అధికారం కావాలనుకునే వారికి కుక్క కాటుకు చెప్పు దెబ్బలా….ఎన్నికల్లో ప్రజలు గట్టి గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే నాని పిలుపునిచ్చారు.

ప్రజల కోసం మంచి చేసిన సీఎం జగన్ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు మద్దతుగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారంలో పట్టణ వైసిపి అధ్యక్షుడు గొర్ల శ్రీను, మార్కెట్ యార్డ్ చైర్మన్ మట్టా నాగమణి జాన్ విక్టర్, జిల్లా యూత్ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు, సీనియర్ నాయకులు పాలేటి చంటి, దుక్కిపాటి శశి భూషణ్, జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణరెడ్డి, జడ్పిటిసిలు గోళ్ళ రామకృష్ణ ,కందుల దుర్గా కుమారి,ఎంపీపీలు పెయ్యల ఆదాం,గద్దె పుష్పరాణి,కొడాలి సురేష్( Kodali Suresh ), వైస్ ఎంపీపీలు బొట్టు నాగలక్ష్మి,పూడి సుధాకర్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చింతల భాస్కరరావు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ బాజీ,ఉపాధ్యక్షుడు అలిబెగ్,ఎస్సీ సెల్ అధ్యక్షుడు రేమల్లి నీలాకాంత్, బిసి సెల్ అధ్యక్షుడు నైనవరపు శేషు బాబు, పట్టణ యాదవ సంఘం అధ్యక్షుడు డోక్కు రాంబాబు, యువత రాష్ట్ర కార్యదర్శి అద్దేపల్లి పురుషోత్తం,ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేండా చంద్రాపాల్, వైయస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకులు తులిమిల్లి యషయ్య,వికలాంగుల విభాగ రీజినల్ కో ఆర్డినేటర్ దొండపాటి మదుకిరణ్.

మహిళా విభాగ అధ్యక్షురాలు మాదాసు వెంకటలక్ష్మి, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ నగుళ్ల సత్యనారాయణ,9వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జోగ సూర్య ప్రకాషరావు, జోగా కిషోర్, గొర్ల శ్రీను, గండి వెంకటరమణ, పైడిపాటి శ్రీనివాసరావు, చందగ కృష్ణ, రామకృష్ణ, గాదే మోహన్, జోగా రాఘవ, సూర్యనారాయణ,చింతా జ్యోతి,రజనీ, శైలజ, అశోక్ జైన్,మహేష్ జైన్, పల్లంట్ల శ్రీను, గాదె మోహన్ బాబు,కీర్తి కుమార్ జివావత్ ,సిరిగుడి శ్రీనివాసరావు, నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంపటి సైమన్, షేక్ సయ్యద్ ,కోంకితల ఆంజనేయ ప్రసాద్,తోట శివాజీ, చుండురి శేఖర్, అగస్త్యరాజు కృష్ణమోహన్, రమణ కుమార్, కృష్ణ కిషోర్ ,కట్టా రాంబాబు, కే.రవీ ,వీరిశెట్టి నరసింహారావు, జోగా నాగేశ్వరరావువెంపల అప్పారావు,రావులకొల్లు సుబ్రమణ్యం,రావుల కొల్లు నాగమల్లేశ్వర రావు,మండాది శ్రీను.

పర్వతనేని ఆనంద్,అడపా పండు , పంచకర్మ వెంకట్,మహమ్మద్ ఖాసిం అబూ, అబ్దుల్ రజాక్,వడ్లాని సుధాకర్,జ్యోతుల శ్రీను,జ్యోతుల సత్యవేణి, మూడేడ్ల ఉమా,దారం నరసింహారావు, మోండ్రు వెంకటేశ్వరరావు,సింగిరెడ్డి గాగారిన్, వంగపండు బ్రహ్మాజీ,లోయ వరాలు, మాదాసు వెంకటలక్ష్మి,లోయ రాజేష్,రిటైర్డ్ సిఐ పి.వెంకట్రావు, నల్లమోతు జగదీష్, స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మహేష్ కలపాల కిరణ్,గానుగుల ఆనందమురళి, చందరాల హరి రాంబాబు, తోట రాజేష్, గుదే రవి, పూడి సుధాకర్, మూడేడ్ల రామారావు,డాక్టర్ ఆర్కె, తోట సాయి, జ్యోతుల మణికంఠ,జూనియర్ జమదగ్ని,నిరుడు ప్రసాద్,బొండాల శ్రీను, అసిలేటి అర్జునరావు, గంటా శ్రీను, ఘంటా సురేష్, కొత్తూరి లక్ష్మీనారాయణ,అల్లం రామ్మోహన్రావు, అడబాల అప్పారావు,దుడ్డు చిన్నా,గొల్ల సోమేశ్వరరావు, జహృద్దిన్, ఖాదర్ బేగ్, సత్తిరెడ్డి, గంటా చంద్రశేఖర్,రజాక్ భాష,పెద్ది రమణ,పిడుగు శ్రీను, చౌటపల్లి కళ్యాణ్, వినోద్, పొట్లూరి మురళి, మామిళ్ల ఎలీషా,dvs శ్యామ్ కుమార్, కలపాల నాగులు,గొకరకొండ హారినాద్,పుల్లేటికుర్తి కృష్ణ,నల్లూరి శ్రీనివాసరావు, తాళ్లూరి ప్రశాంత్,కొండపల్లి కుమార్ రెడ్డి,పప్పు యాదవ్, వంగపండు బ్రహ్మాజీ.

తోటా నాగరాజు, కందుల నాగరాజు, కొండపల్లి చంద్రశేఖర్ రెడ్డి, పిల్లి బెనర్జీ, కొండపల్లి కుమార్ రెడ్డి,సర్దార్ బెగ్, కంచర్ల జగన్,రవి స్వీట్స్ మోహన్, ఎండి యాకూబ్, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అబ్దుల్ రహిం, ఎండి సాలెహా,కొండపల్లి శ్రీనివాసరెడ్డి, క్రేన్ బాబి,కంచర్ల జగన్, దేవరపల్లి కోటి, లోయ కన్నా,యార్లగడ్డ సత్యభుషన్, కోటప్రోలు నాగు,సాల్ట్ బాబ్జి,జొన్నలగడ్డ అజయ్,బెజ్జం సువర్ణ బాబు,పసలాది శేఖర్, దోమ రఘు,మచ్చా పద్మ, రేమల్లి దాస్ కుమార్,కుంభం నాగమణి,దారం కాంచన కుమారి, శేషం నిర్మల , కొండా నాగమయ్య,గిరి బాబాయ్ ,పాలడుగు రామ్ ప్రసాద్, పలు గ్రామాల ప్రజాప్రతినిధులు,గుడివాడ నియోజకవర్గ పరిధిలో గుడివాడ టౌన్, రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుబంధ విభాగాల నాయకులు, కొడాలి నాని అభిమానులు, పెద్ద సంఖ్యలో ప్రజానీకం పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube