US Hong Kong : హక్కుల అణిచివేత ..అమెరికా ఆగ్రహం, హాంకాంగ్ అధికారుల వీసాలపై పరిమితులు

చైనా .హాంకాంగ్‌ను( Hong Kong ) కబళించేందుకు జోరుగా యత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

 Us Imposes New Visa Restrictions On Hong Kong Officials Over Rights Suppression-TeluguStop.com

ఇప్పటికే తైవాన్‌పై కన్నేసిన డ్రాగన్ .దక్షిణ చైనా సముద్రంలో( South China Sea ) యుద్ధ విన్యాసాలు చేస్తోంది.ప్రపంచ దేశాల ఒత్తిడితో ప్రస్తుతానికి చైనా అంతటి దుస్సాహాసానికి పాల్పడటం లేదు.ఇదిలావుండగా .చైనాకు ముక్కుతాడు వేసేందుకు అమెరికా( America ) రంగంలోకి దిగింది.చైనా నియంత్రణలో ఉన్న భూభాగంలో హక్కులు , స్వేచ్ఛల అణిచివేతకు ప్రతిస్పందనగా హాంకాంగ్‌కు చెందిన అధికారులపై వీసా పరిమితులు( Visa Restrictions ) ప్రవేశపెట్టాలని అమెరికా శుక్రవారం ప్రకటించింది.

గతేడాది హాంకాంగ్ హామీ ఇచ్చిన స్వయం ప్రతిపత్తి , ప్రజాస్వామ్య నిర్మాణాలు , ప్రాథమిక స్వేచ్ఛలపై చైనా స్థిరమైన ఉల్లంఘనను పేర్కొంటూ యూఎస్ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్( Antony Blinken ) ఒక ప్రకటన విడుదల చేశారు.ఇందులో ఆర్టికల్ 23గా సూచించబడే కొత్త జాతీయ భద్రతా చట్టం అమలు కూడా వుంది.

Telugu Antony Blinken, Article, China, Hong Kong, Hongkong, China Sea, Secretary

గతేడాది పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పీఆర్‌సీ).హాంకాంగ్‌కు గతంలో ఇచ్చిన అత్యున్నత స్థాయి స్వయం ప్రతిపత్తి, ప్రజాస్వామ్య సంస్థలు , హక్కులు , స్వేచ్ఛలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటూనే వుంది.దీనిలో భాగంగా ప్రాథమిక చట్టంలోని ఆర్టికల్ 23 కింద హాంకాంగ్ అధికారులు ఇటీవల రూపొందించిన చట్టం ద్వారా దేశద్రోహం, రాష్ట్ర రహస్యాలు, విదేశీ సంస్థలతో పరస్పర చర్యలకు సంబంధించి విస్తృత, అస్పష్టంగా నిర్వచించబడిన నిబంధనలు వున్నాయని బ్లింకెన్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.ఈ నిబంధనలు రెండూ హాంకాంగ్‌లోని అసమ్మతిని తొలగించడానికి ఉపయోగించబడతాయని బ్లింకెన్ చెప్పారు.

Telugu Antony Blinken, Article, China, Hong Kong, Hongkong, China Sea, Secretary

ఇమ్మిగ్రేషన్ సెక్షన్‌ 212 (ఏ)(3)(సీ) ప్రకారం హక్కులు , స్వేచ్ఛలపై తీవ్ర అణిచివేతకు కారణమైన హాంకాంగ్‌ అధికారులపై కొత్త వీసా పరిమితులను విధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.ఈ కొత్త ఆంక్షల ద్వారా ఏ అధికారులను టార్గెట్ చేస్తారో అన్నది బ్లింకెన్ తన ప్రకటనలో పేర్కొనలేదు.నవంబర్‌లో మునుపటి యూఎస్ బిల్లును అనుసరించింది.ఇది 49 మంది హాంకాంగ్ అధికారులు, న్యాయమూర్తులు, జాతీయ భద్రతా కేసుల్లో వున్న ప్రాసిక్యూటర్‌లపై ఆంక్షలు విధించాలని సూచించింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube