నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు.దీనిలో భాగంగా పార్టీ కార్యాలయంతో పాటు, సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని ఆయన ప్రారంభించారు.
అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు.దాదాపు 60 ఏళ్లు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు సీఎం కేసీఆర్.
రాష్ట్రంలో ఉన్న ఏ పథకం కూడా దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని తెలిపారు.దళితుల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన దళితబంధు పథకం వేరే ఏ రాష్ట్రంలో లేదన్నారు.
మోటార్లకు మీటర్లు బిగించాలని ప్రధాని అంటున్నారని కేసీఆర్ తెలిపారు.దేశంలో ప్రతిదీ ప్రైవేట్ పరం చేసిన కేంద్రం.
వ్యవసాయాన్ని ఆపేసి రైతుల దగ్గర భూములు లాక్కొవాలని కుట్ర పన్నుతుందని వ్యాఖ్యనించారు.దేశంలో ప్రస్తుతం ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు.కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక బీజేపీని తరిమి కొడదామని పిలుపునిచ్చారు.2024లో బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నారు.ఢిల్లీ గద్దె మీద కూడా మన ప్రభుత్వమే రాబోతోందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.







