భూమి ఫడ్నేకర్ షేహనాజ్ గిల్, కుషా కపిలా ప్రధాన పాత్రలలో తెరకెక్కించిన చిత్రం థాంక్యూ ఫర్ కమింగ్.( Thank You For Coming ) ఇటీవల విడుదలైనటువంటి ఈ సినిమా మిశ్రమ స్పందన లభించింది.
ఇది ఒక అడల్ట్ సినిమా కావడంతో పెద్దగా ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేకపోయింది.ఇక ఈ సినిమా నిర్మాతలలో ఒకరైనటువంటి నటి ఏక్తా కపూర్( Ekta Kapoor ) ఆస్క్ మీ అంటూ ట్విట్టర్ వేదికగా నేటిజన్స్ తో సరదాగా ముచ్చటించారు.
అయితే నేటిజన్స్ మాత్రం ఈమె పట్ల చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఈమెకు ట్విట్టర్ నోట్ రాస్తూ.నీ కారణంగా ఎంతోమంది యువత చెడిపోతున్నారు.ఇప్పటినుంచి అయినా మంచి సినిమాలు చేయడం తెలుసుకో అంటూ కామెంట్ చేశారు.
మరికొంతమంది కామెంట్స్ చేస్తూ నువ్వు కరణ్ జోహార్( Karan Johar ) కలిసి చాలామందిని చెడగొడుతున్నారు.ఎంతోమంది విడాకులు తీసుకుని విడిపోవడానికి మీరిద్దరే కారణం అంటూ నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఇలా నేటిజన్ కామెంట్ చేయడంతో ఏక్తా కపూర్ స్పందిస్తూ అవునా అంటూ రిప్లై ఇచ్చారు అయితే మరొక నేటిజన్ కూడా ఈమెకు కామెంట్ చేస్తూ.దయచేసి మీరు ఇలాంటి అడల్ట్ సినిమాలు చేయడం మానేయండి ఇది నా విజ్ఞప్తి అంటూ కామెంట్ చేశారు.

ఇలా నేటిజన్స్ కామెంట్ చేయడంతో ఈ కామెంట్ పై స్పందించినటువంటి ఈమె ఆ సమస్య లేదు ఎందుకంటే నేను అడల్ట్ కాబట్టి ఇలాంటి అడల్ట్ సినిమాలు చేస్తానని సినిమాలను చేయడం మాత్రం మానుకోను అంటూ ఈమె రిప్లై ఇచ్చారు.ఇలా తన గురించి సోషల్ మీడియా వేదికగా ఎన్ని విమర్శలు వచ్చిన వాటన్నింటిని తాను ఏమాత్రం పట్టించుకోనని తనకు నచ్చినదే చేస్తాను అంటూ ఈ సందర్భంగా ఈమె నెటిజన్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకనే చెప్పేశారు.ఇలా ఏక్తా కపూర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.







