చాలా మంది పిల్లలు అల్లరి చేస్తుంటారు.అయితే కొందరు మాత్రమే ముద్దొచ్చే పనులు చేస్తుంటారు.
చెప్పిన మాట తూచా తప్పకుండా వింటూ అందరికీ నచ్చేలా ఉంటారు.ముఖ్యంగా భారతీయ కుటుంబంలో పిల్లలు పెరుగుతున్నప్పుడు, వంటగదిలో తమ తల్లికి సహాయం చేస్తుంటారు.
పిల్లలు చిన్న చిన్న పనులు చేస్తుంటే వారిని చూసి తల్లులు మురిసి పోతుంటారు.వారిని ముద్దులు పెట్టుకుని, వారు చేసిన చిన్న పనులను ఇతరులకు గొప్పగా చెప్తుంటారు.
అయితే ఇదే కోవలో ఓ బుడతడు తన వంట నైపుణ్యంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు.అతడు చేసిన వంటకం చూసి నెటిజన్లు నోరూరుపోతుందని కామెంట్ చేశారు.

కొందరు పిల్లలు తమ తల్లులకు వంటగదిలో చిన్న చిన్న సాయాలు చేస్తుంటారు.ఇలా చిన్న వయసులోనే వంటలో నైపుణ్యం సాధిస్తుంటారు.ఇదే రీతిలో నిండా ఐదేళ్లు కూడా లేని ఓ పిల్లాడు అద్భుతంగా ఎగ్ శాండ్ విచ్ చేశాడు.అది కూడా నైపుణ్యం ఉన్న చెఫ్‌ల మాదిరిగా ఎగ్ శాండ్ విచ్ తయారు చేశాడు.
దీనిని ట్విట్టర్‌లో ‘ఫిగెన్’ అనే ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు.

వీడియోలో ఒక పిల్లవాడు హాట్ ప్లేట్ ముందు కూర్చున్నాడు.ముందుగా బ్రెడ్ ముక్కను కాల్చాడు.పసి పిల్లవాడు గుడ్డును పగలగొట్టి, కాల్చిన రొట్టె లోపల పాలకూర ఆకు ఇతర పదార్థాలు పెట్టాడు.
చక్కగా వాటిని కాల్చాడు.కాసేపటికే ఎగ్ శాండ్ విచ్ తయారు అయింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ పిల్లాడి వంట నైపుణ్యానికి ఆవ్చర్యపోతున్నారు.ఈ వీడియోకు ఇప్పటికే 9.02 లక్షల వ్యూస్, 14 వేల లైక్‌లు వచ్చాయి.చాలా మంది నెటిజన్లు ఆ బుడ్డోడిని ప్రశంసిస్తున్నారు.
కాకలు తీరిన చెఫ్‌ల మాదిరిగా ఆ ఎగ్ శాండ్ విచ్ చేశాడని ప్రశంసిస్తున్నారు.అయితే పసిపిల్లల నైపుణ్యాలు బాగున్నా, వారి జాగ్రత్తలను ప్రజలు పట్టించుకోవాలని కొందరు నెటిజన్లు సూచిస్తున్నారు.







