చిట్లిన జుట్టును రిపేర్ చేసే సూప‌ర్ రెమెడీ ఇది..త‌ప్ప‌కుండా ట్రై చేయండి!

జుట్టు చిట్ల‌డం.ఆడ‌వారిలో చాలా మందిని వేధించే స‌మ‌స్య ఇది.కాలుష్యం, పోష‌కాల కొర‌త‌, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే హెయిర్ ప్రోడెక్ట్స్‌ను వాడ‌టం, వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులు, హెయిర్ స్టైలింగ్ టూల్స్ త‌ర‌చూ యూజ్ చేయ‌డం వంటివి జుట్టు చివ‌ర్లు చిట్లి పోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలు అవుతుంటాయి.

అయితే కార‌ణం ఏదైనా వెంట్రుక‌లు చిట్ల‌డం వ‌ల్ల జుట్టు ఎదుగుద‌ల ఆగి పోతుంది.

అందుకే ఈ స‌మ‌స్య‌ను నివారించుకోవ‌డం కోసం ముప్ప తిప్ప‌లు ప‌డుతుంటారు.ర‌క‌ర‌కాల ఆయిల్స్, ఖ‌రీదైనా షాంపూలు కొనుగోలు చేసి వాడ‌తారు.అయినా ఫ‌లితం లేకుంటే ఏం చేయాలో తెలీక తెగ మ‌ద‌న ప‌డిపోతుంటారు.

అయితే ఇప్పుడు చెప్ప‌బోయే రెమెడీని ట్రై చేస్తే గ‌నుక ఇంట్లోనే చాలా సుల‌భంగా చిట్లిన జుట్టును రిపేర్ చేసుకోవ‌చ్చు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ రెమెడీ ఏంటో.? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.? ఓ చూపు చూసేయండి.

ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక క‌ప్పు కొబ్బ‌రి నూనె పోయాలి.నూనె కాస్త హీట్ అవ్వ‌గానే అందులో వ‌న్ టేబుల్ స్పూన్ అవిసె గింజ‌ల పొడి, గుప్పెడు క‌రివేపాకు వేసి రెండు నిమిషాల పాటు స్లో ఫ్లేమ్‌పై వేయించాలి.ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆఫ్ చేసి ఈ మిశ్ర‌మాన్ని చ‌ల్లార‌ బెట్టుకుని.

Advertisement

ఆపై ఆయిల్‌ను ఫిల్ట‌ర్ చేసుకుని బాటిల్‌లో నింపుకోవాలి.ఇక ఈ ఆయిల్‌ను నైట్ నిద్రించే ముందు జుట్టు మొద‌ళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు అప్లై చేసుకుని ప‌డుకోవాలి.

ఉద‌యాన్నే కెమిక‌ల్స్ త‌క్కువ‌గా ఉండే షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.ఇలా నాలుగు రోజుల‌కు ఒక సారి చేస్తే గ‌నుక చిట్లిన జుట్లు మామూలు స్థితికి రావ‌డ‌మే కాదు.

మ‌ళ్లీ మ‌ళ్లీ జుట్టు చిట్ల‌కుండా కూడా ఉంటుంది.అంతే కాదు, పైన చెప్పిన ఆయిల్‌ను వాడితే హెయిర్ గ్రోత్ కూడా అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.

అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?
Advertisement

తాజా వార్తలు