తుఫాన్ గండం :  ఏపీకి 'దానా ' ఎఫెక్ట్ ఎంత ? 

వరుస తుఫాన్లు , భారీ వర్షాలు , వరదలతో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు సతమతం అవుతున్నాయి.  ముఖ్యంగా ఏపీలో( AP ) ఈ భారీ వర్షాలు,  తుఫాన్లతో భారీగా నష్టమే జరిగింది .

 Effect Of Dana Cyclone On Andhra Pradesh Details, Tufan , Dana Thufan, Cyclone,-TeluguStop.com

తూర్పు మధ్య   బంగాళాఖాతంలోనూ, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడి వాయుగుణంగా మారి ఆ తర్వాత తుఫాన్ గా( Cyclone ) తీవ్ర రూపం  దాల్చనుండడం తో  ప్రజలంతా భయాందోళన చెందుతున్నారు.అయితే ఒడిస్సా,  పశ్చిమ బెంగాల్ మధ్య తుఫాను తీరం దాటే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ ప్రకటించడంతో,  ఏపీలోని తీర ప్రాంతాలకు కొంత ముప్పు తప్పినట్లే అని భావిస్తున్నా,  బలమైన ఈదురు గాలులు , భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

తుఫాను దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

Telugu Andhra Pradesh, Ap Dana Cyclone, Ap, Andha, Control, Cyclone, Dana Cyclon

ఇప్పటికే విశాఖ జిల్లాలో( Visakha District ) దాదాపు 14 కంట్రోల్ రూం లను  ఏర్పాటు చేశారు.కంట్రోల్ రూమ్ లో ( Control Room ) 24 గంటల పాటు పనిచేసే విధంగా సిబ్బందిని,  జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.తుఫాను ప్రభావం మరీ ఎక్కువ ఉండకపోవచ్చు అని చెబుతున్నప్పటికీ ముందస్తు చర్యలకు అధికారులు దిగారు.

  మత్స్యకారుల చేపల వేటను పూర్తిగా నిషేధించారు.ఈనెల 26వ తేదీ వరకు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు చేశారు .తీరప్రాంతాల ప్రజలు ఏ క్షణమైనా పునరావస కేంద్రాలకు తరలివచ్చేలా సిద్ధంగా ఉండాలని అధికారులు అప్రమత్తం చేశారు భారీ వర్షాలు పడితే విద్యాసంస్థలు కూడా సెలవులు ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు.

Telugu Andhra Pradesh, Ap Dana Cyclone, Ap, Andha, Control, Cyclone, Dana Cyclon

అయితే వాతావరణ ప్రభావాన్ని బట్టి వీటిపై నిర్ణయం తీసుకోనున్నారు.  అక్టోబర్ 24 , 25 తేదీల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది .పశ్చిమ,  మధ్య బంగాళాఖాతం తీరం వెంబడి గంటకు 45 – 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.అల్పపీడనం రేపు తుఫాన్ గా బలపడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది .ఇప్పటికి అనంతపురం జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తూ, తుఫాన్ ప్రభావ నష్టాన్ని తగ్గించే ప్రయత్నాలు చేపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube