ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ కు ఈడీ సమన్లు జారీ చేసింది.ఈ మేరకు రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.
ఐఎల్, ఎఫ్ఎస్ స్కాం కేసులో జయంత్ పాటిల్ పై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆయనకు ఈడీ నోటీసులు ఇచ్చింది.కాగా జయంత్ పాటిల్ ఎన్సీపీ మహారాష్ట్ర శాఖకు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
కోహినూర్ నిర్మాణానికి ఇచ్చిన రుణాలపై మహారాష్ట్ర నవ నిర్మాణ సేన రాజ్ థాకరేను ఇప్పటికే ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే.







