ఓటుకి నోటు కేసులో విచారణ వేగం పెంచిన ఈడీ!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఓటు కి నోటు కేసు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఎన్డీఏ మిత్రపక్షంగా తెలుగుదేశం ఉన్నంతకాలం ఈ కేసును తెర ముందుకు తీసుకు రాకుండా కేంద్ర స్థాయిలో ఒత్తిళ్లు పనిచేశాయి.

 Ed Speed Up The Process On Vote For Note Case-TeluguStop.com

అయితే ఏపీ విభజన హామీలు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం తో గొడవపడి బయటికి వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓటు కి నోటు కేసు మరో సారి ఎందుకు బిజెపి ప్రభుత్వం సిద్ధమైనట్లు తాజా పరిణామాలు చూస్తుంటే స్పష్టమవుతుంది.తాజాగా హైదరాబాదులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఓటుకు నోటు కేసు విచారణ వేగవంతం చేసినట్లు తెలుస్తుంది.

ఈ కేసులో భాగంగా అందులో ముడుపులు అందుకోవడం ప్రయత్నం చేస్తున్న స్టీఫెన్ సన్ నిర్ణయం ఈడీ అధికారులు ఏకంగా ఆరు గంటల పాటు విచారించారు.ఇందులో మధ్యవర్తి గా ఉన్న వ్యక్తిని కూడా విచారించి ముడుపులకు సంబంధించిన వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు.

అలాగే వారి బ్యాంకు లావాదేవీలను పరిశీలించి, ఓటుకు నోటు కోసం తీసుకున్న 50 లక్షలు, ఇస్తామని చెప్పిన నాలుగున్నర కోట్ల డబ్బు గురించి ఈడి అధికారులు స్టీఫెన్ సన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది.మరి ఈ కేసులో ఇప్పటి వరకు ఈడీ చంద్రబాబునాయుడుని కానీ రేవంత్ రెడ్డి గాని పూర్తిస్థాయిలో విచారించలేదని తెలుస్తోంది.

ఇప్పటికే బిజెపి ప్రభుత్వం తో తీవ్ర స్థాయిలో విభేదించి మాటల దాడి చేసుకుంటున్న తెలుగుదేశం పార్టీ బిజెపి మధ్య ఓటుకు నోటు కేసు ఎన్నికల ముందు ఏ స్థాయిలో వేడిని రాజేస్తుందని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube