ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.ఈ క్రమంలో ఎల్లుండి విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi liquor scam ) కేసులో కేజ్రీవాల్ కు ఈడీ ఐదోసారి నోటీసులు అందజేసింది.అయితే ఇప్పటివరకు ఈడీ ముందు సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరుకాలేదన్న సంగతి తెలిసిందే.ఈడీ నోటీసులు అక్రమం అంటూ కొట్టిపారేశారు.తనను అరెస్ట్ చేసే కుట్రలో భాగంగా ఈడీ నోటీసులు( ED notices ) ఇస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అయితే తాజాగా ఈడీ జారీ చేసిన నోటీసులపై సీఎం కేజ్రీవాల్ ఇంకా స్పందించలేదని తెలుస్తోంది.