ఢిల్లీలోని వక్ఫ్ బోర్డ్( Delhi Waqf Board ) అవకతవకలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక దృష్టి సారించింది.ఈ క్రమంలోనే ఆప్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్( AAP MLA Amanatullah Khan ) అరెస్టుకు రంగం సిద్ధం చేసిందని తెలుస్తోంది.
అయితే వక్ఫ్ బోర్డ్ నియామకాల్లో ఎమ్మెల్యే అనమతుల్లా ఖాన్ ఆక్రమాలకు పాల్పడ్డారని ఈడీ ఆరోపణలు చేస్తుంది.ఈ నేపథ్యంలోనే ఢిల్లీ కోర్టులో ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ అరెస్ట్ వారంట్ కోసం పిటిషన్ దాఖలు చేసింది.
అయితే కోర్టు ఎమ్మెల్యే అరెస్ట్ చేసేందుకు వారంట్ జారీ చేస్తుందా? లేదా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.