తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ప్రచారంలో డీఎంకే పార్టీ నేత కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా తమిళనాడు సీఎం పళని స్వామి పై కాంట్రవర్సీ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.
దీంతో ఎ.రాజా చేసిన వ్యాఖ్యల పట్ల అన్నాడీఎంకే పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో.తాజాగా ఈసీ స్పందించడం జరిగింది.
ఎ.
రాజా ఈరోజు సాయంత్రం 6 గంటల్లోగా నోటీసుకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.తమిళనాడు ముఖ్యమంత్రి పై అదేవిధంగా ఈపీఎస్ పై చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని తెలిపింది.
మహిళల మాతృత్వ గౌరవాన్ని తగ్గినట్టు వ్యాఖ్యలు ఉన్నాయని ఎన్నికల సంఘం నోటీసులో పేర్కొంది.కచ్చితంగా ఆ కామెంట్లు ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తాయని, చేసిన వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే ఇప్పటికే పళని స్వామి పై చేసిన వ్యాఖ్యల పట్ల ఎ.రాజా క్షమాపణలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎ.రాజా చేసిన వ్యాఖ్యల పట్ల డీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ కూడా మందలించడం జరిగింది.ఇలాంటి తరుణంలో ఎన్నికల సంఘం నుండి ఎ.రాజా కి నోటీసులు రావటం తమిళ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.