తొమ్మిది మాసాల పాటు తల్లి, బిడ్డ, ఇద్దరిది ఒకే ప్రాణం.తల్లి ఆరోగ్యంగా ఉంటే, బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది.
తల్లి అనారోగ్యంగా ఉంటే బిడ్డ కూడా అనారోగ్యంగా ఉంటుంది.తొమ్మిది మాసాలపాటు తల్లి తిండి అలవాట్లు, శారీరక, మానసిక పరిస్థితులే బిడ్డపై ప్రభావం చూపుతాయి.
ప్రభావితం చేసే అవకాశం ఉన్నప్పుడు బిడ్డను తెలివిగా తయారు చేయవచ్చు కదా.ఏంటి అలా కూడా చేయొచ్చా అని ఆశ్చర్యపోకండి.చేయవచ్చు అని సరికొత్త అధ్యయనాలు చెబుతున్నాయి.
గర్భంతో ఉన్నప్పుడు తల్లి పండ్లు ఎక్కువగా తింటే పిల్లలు తెలివిగా పుడతారట.పండ్లతో ఎన్నోరకాల రోగాలను బిడ్డ దరికి చేరకుండా కాపాడుకోవచ్చు అనేది ఏళ్ళుగా మనకు తెలిసిన విషయమే.అయితే 688 మంది పిల్లల్ని పరీక్షించి, తల్లి పండ్లు తింటూ ఉంటే, బిడ్డ మెదడు శక్తివంతంగా పనిచేస్తుందని తేల్చిచెప్పారు కెనాడియన్ హెల్తి ఇంఫంట్ డెవలప్మెంట్ స్టడి వారు.
ఇంకేం .పండ్లు తినటం వలన వచ్చే లాభాల్లో మరొ కొత్త లాభం బయటపడింది.చదివి తెలుసుకున్న గర్భిణీస్త్రీలు ఎవరైనా ఉంటే, రోజూ తినడానికి కొన్ని పండ్లు తీసుకురమ్మని మీ భర్తలకు ఆర్డరు వేయండి.మీ బిడ్డకు చురుకైన మెదడుని అందించండి.