ప్రతిరోజు మధ్యాహ్నం ఒకటి తర్వాత భోజనం చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే..!

ప్రస్తుత రోజులలో ప్రజలకు ఆరోగ్యం మీద శ్రద్ధ కాస్త పెరిగింది అని చెప్పవచ్చు.ప్రతి ఒక్కరు హెల్త్ కాపాడుకునే విషయంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అయితే ఆహారం తీసుకునే వేళలు కూడా ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయని పెద్దవారు చెబుతూ ఉంటారు.కానీ ఇప్పటి వరకు చాలా మంది దీన్ని పాటించకుండా ఉన్నారు.

ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలని నిర్ణయించుకున్నాక దిన చర్యలో కొన్ని చిన్న విషయాలను మర్చిపోతారు.ఇది వారి శరీరం పై దుష్ప్రభావాలను కలిగిస్తుంది.

ఆరోగ్యం సరి అయిన దారిలో ఉండాలంటే ఆహారాన్ని సమయానికి తీసుకోవడం మొదలుపెడితే అనేక పొట్ట సంబంధిత సమస్యల( Stomach Problem )ను నివారించవచ్చు.ఆలస్యంగా భోజనం( Meal ) చేయడం వల్ల కలిగే నష్టాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల మధ్య అంటే సరైన సమయానికి భోజనం చేయకపోతే కడుపులో ఎసిడిటీ సమస్య వస్తుంది.

Advertisement

సమయానికి భోజనం చేయకపోవడం వల్ల అనేక ఇతర జీర్ణ సమస్యలు కూడా వస్తాయి.అటువంటి పరిస్థితుల్లో పొట్ట వ్యాధులను నివారించాలంటే సరైన సమయంలో భోజనం చేయాలి.

కడుపులో ఎసిడిటీ( Acidity ) ఏర్పడినప్పుడు దానిని వైద్యభాషలో గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లెక్స్ వ్యాధి లేదా యాసిడ్ రిఫ్లక్స్ వ్యాధి అని అంటారు.ముఖ్యంగా చెప్పాలంటే సమయానికి భోజనం చేయకపోవడం వల్ల తలనొప్పి( Headache ) వస్తుంది.ఆకలి వల్ల ఇది వస్తుంది.

భోజనం ఆలస్యం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గిపోతుంది.ఇది తలనొప్పిని ప్రేరేపిస్తుంది.

అలాగే కొన్ని సార్లు చిరాకు కూడా వస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే మధ్యాహ్నం భోజనం చేయకపోతే కడుపులో గ్యాస్ సమస్య( Gas problem ) వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్, మిథైన్, హైడ్రోజన్, ఆక్సిజన్లతో తయారైన వాయువులు కూడా పొత్తి కడుపు లో నొప్పిని కలిగిస్తాయి.అటువంటి పరిస్థితిలో ఆలస్యంగా భోజనం చేసేవారు ఈ అలవాటును దూరం చేసుకోవడం ఎంతో మంచిది.

Advertisement

తాజా వార్తలు