Raw Papaya Soup : డిన్న‌ర్‌లో ప‌చ్చి బొప్పాయిని ఈ విధంగా తీసుకుంటే పొట్ట కొవ్వు ప‌రార్‌!

పొట్ట కొవ్వును తగ్గించుకునేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.కఠినమైన డైట్‌ ఫాలో అవుతుంటారు.

అయితే పొట్ట కొవ్వును మాయం చేయడంలో పచ్చి బొప్పాయి అద్భుతంగా సహాయపడుతుంది.ముఖ్యంగా డిన్నర్ లో పచ్చి బొప్పాయిని ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే చాలా వేగంగా కొవ్వు కరిగి పొట్ట నాజూగ్గా మారుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ప‌చ్చి బొప్పాయిని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక చిన్న సైజు పచ్చి బొప్పాయిని తీసుకుని పీల్ తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ ముక్కలను ఆవిరిపై ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి.ఈలోపు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు, వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ తరిగి పెట్టుకున్న లెమన్ గ్రాస్ వేసుకుని రెండు నిమిషాల పాటు స్లో ఫ్లేమ్ పై వేయించుకోవాలి.

Advertisement

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో ఆవిరిపై ఉడికించుకున్న పచ్చి బొప్పాయి ముక్కలు ఒక కప్పు, వేయించి పెట్టుకున్న పదార్థాలు, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, రుచికి సరిపడా రాక్ సాల్ట్ ను వేసుకోవాలి.చివరిగా ఒకటిన్నర గ్లాస్‌ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో అర కప్పు కొబ్బరి పాలు, అర కప్పు ఉడికించిన స్వీట్ కార్న్, చిటికెడు మిరియాల పొడి, రెండు టేబుల్ స్పూన్లు తరిగిన కొత్తిమీర వేసుకుని కలిపితే పచ్చి బొప్పాయి సూప్ సిద్ధం అవుతుంది.

ఈ సూప్ ను నైట్ డిన్నర్ లో తీసుకోవాలి.ఈ సూప్ ను తీసుకోవడం వల్ల అందులో ఉండే ప‌లు సుగుణాలు పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తాయి.దాంతో బెల్లీ ఫ్యాట్ దూర‌మై పొట్ట నాజూగ్గా మారుతుంది.

కాబ‌ట్టి, ఎవరైతే పొట్ట కొవ్వుతో ఇబ్బంది పడుతున్నారో కచ్చితంగా వారు తమ డైట్ లో ఈ పచ్చి బొప్పాయి సూప్ ను చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

మ‌ధుమేహాన్ని అదుపు చేసే నిమ్మ తొక్క‌లు..ఎలా తీసుకోవాలంటే?
Advertisement

తాజా వార్తలు