సంగారెడ్డి జిల్లాలో భూకంపం..!

Earthquake In Sangareddy District..!

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో భూకంపం సంభవించింది.బిలాల్ పూర్ లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

 Earthquake In Sangareddy District..!-TeluguStop.com

రాత్రి 3 గంటల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది.దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

అయితే భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.కాగా భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.6 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.అదేవిధంగా నల్గొండ జిల్లాకు సుమారు 117 కిలోమీటర్ల దూరంలో భూమికి ఐదు కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు వెల్లడించింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube