5వ రోజు దుర్గమ్మ లలిత త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.అమ్మవారు శ్రీచక్ర అధిష్టానశక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధి దేవతగా వేంచేసి తననికొలిచే భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తున్నది.
శ్రీ లక్ష్మీదేవి, శ్రీసరస్వతీదేవి ఇరువైపులా వింజామరలతో సేవిస్తూవుండగా చిరుమందహాసంతో, వాత్సల్య రూపిణిగా చెరకుగడను చేతపట్టుకొని శివుని వక్షస్థలంపై కూర్చొని శ్రీలలితా త్రిపురసుందరీ దేవిగా దర్శనమిస్తుంది.దర్శనమిచ్చే సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడుగా, శ్రీ అమ్మవారు త్రిపురసుందరీ దేవిగా భక్తులచేత పూజలందుకుంటారు.
మల్లికార్జున మహామండపంలో ఆరో అంతస్తులో ఉదయం 7గంటల నుంచి 9గంటల వరకు, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక కుంకుమార్చన నిర్వహిస్తారు.త్రిపుర సుందరి లేదా మహా త్రిపుర సుందరి దశ మహావిద్యలలో ఒక స్వరూపము.
సాక్ష్యాత్ ఆది పరాశక్తి.ముల్లోకాలకి సుందరి కావున త్రిపుర సుందరి అంటారు.
సకల ఐశ్వర్య ప్రధాయిని లలితా త్రిపుర సుందరి….పురాత్రయంలో రెండో శక్తి లలితా అమ్మవారు.
దేవి ఉపసకులకు ఈమె ముఖ్య దేవత.త్రిగుణాతీతమైన కామేవ్వరీ స్వరూపము అమ్మ.