డైరెక్టర్ అభిలాష్ జోషి దర్శకత్వంలో రూపొందిన సినిమా కింగ్ ఆఫ్ కొత్త.( King of Kotha ) ఇందులో దుల్కర్ సల్మాన్, ప్రసన్న, షబీర్, గోకుల్ సురేష్, ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉషా తదితరులు నటించారు.
ఈ సినిమాను వేఫేరర్ ఫిలిమ్స్, జి స్టూడియోస్ బ్యానర్ లో నిర్మించారు.జేక్స్ బిజోయ్, షాన్ రెహ్మాన్ సంగీతం అందించారు.
అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.అంతేకాకుండా సినిమాపై బాగా అంచనాలు పెంచాయని చెప్పాలి.
అయితే ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఆకట్టుకుందో చూద్దాం.పైగా కొత్త కొత్త కాన్సెప్ట్ తో ముందుకు వచ్చే దుల్కర్ సల్మాన్ కు( Dulquer Salmaan ) ఈ సినిమా హిట్ ఎంత అందించిందో చూద్దాం.
కథ:
రాజు (దుల్కర్ సల్మాన్) కోత అనే ఊరిలో రాజుగా ఏలుతుంటాడు.అయితే రాజు తన తండ్రి లాగా పెద్ద రౌడీ అవుతాడు.
ఫ్యామిలీకి దూరంగా ఉంటూ తన ఫ్రెండ్ కన్నా (షబీర్)తో కలిసి ఉంటాడు.ఇక రాజుకు రీతూ (అనికా సురేంద్రన్)( Anika Surendran ) అని చెల్లెలు ఉంటుంది.
తను అంటే రాజుకు చాలా ప్రాణం.అయితే అదే ఊర్లో ఉండే తార (ఐశ్వర్య లక్ష్మి) ను( Aishwarya Lakshmi ) రాజు ప్రేమిస్తాడు.
తనకి కూడా రాజు అంటే చాలా ప్రాణం.అయితే రాజు తార కోసం ఊర్లో గంజాయి, డ్రగ్స్ వంటివి లేకుండా చేస్తాడు.
అయితే ఓసారి రాజు కొన్ని కారణాల వల్ల ఆ ఊరు వెళ్లి పోవాల్సి వస్తుంది.ఇక కోతా గ్రామాన్ని కన్నా తన ఆధీనంలోకి తీసుకొని ఆ ఊరిని మళ్లీ నాశనం చేస్తుంటాడు.
దీంతో ఆ ఊరికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ షావుల్ (ప్రసన్న) మళ్లీ రాజుని ఊళ్లోకి వచ్చేలా చేస్తాడు.అయితే రాజు తన స్నేహితుడు కన్నాను ఏం చేస్తాడు.
మళ్లీ ఊరిని మంచిగా మారుస్తాడా లేదా.చివరికి ప్రేమించిన అమ్మాయిని కలుస్తాడా లేదా అనేది మిగిలిన కథలోనిది.

నటినటుల నటన:
నటీనటుల నటన విషయానికి వస్తే.ఇప్పటికే దుల్కర్ సల్మాన్ తెలుగులో తన నటనను చూపించి మంచి పేరు సంపాదించుకున్నాడు.ఇక ఈ సినిమాలో కూడా రాజ్ పాత్రలో బాగా అదరగొట్టాడు.యాక్షన్స్ సీన్స్ తో మెప్పించాడు.చెల్లిగా నటించిన అనికా పాత్ర( Anika Surendran ) కూడా బాగా ఆకట్టుకుంది.ఐశ్వర్య లక్ష్మి కూడా బాగానే నటించింది.
మిగిలిన నటీనటులంతా తమ పాత్రకు న్యాయం చేసినట్లు కనిపించారు.

టెక్నికల్:
టెక్నికల్ విషయానికి వస్తే.ఆర్ఆర్ బాగా ఆకట్టుకుంది.నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంది.
ఇక పాటలు కూడా పరవాలేదు.సినిమాటోగ్రఫీ కూడా బాగా ఆకట్టుకుంది.మిగిలిన నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి.
విశ్లేషణ:
ఇక ఈ సినిమా మొత్తం 80,90 దశకంలో జరుగుతుంది.అయితే కొత్త( Kotha ) అనేది మలయాళంలో ఊరు లేదా పట్టణం అని అర్థం.అయితే ఈ సినిమా ఏ మాత్రం కొత్తగా అనిపించదు.కొన్ని సన్నివేశాలు ఆల్రెడీ చూసాం అన్నట్లుగా ఫీలింగ్ కలుగుతుంది.సెకండాఫ్ ట్విస్టులు బాగున్నాయని చెప్పాలి.
కొన్ని సన్నివేశాలు అయితే బోర్ కొట్టేలాగా చూపించాడు డైరెక్టర్.

ప్లస్ పాయింట్స్:
ట్విస్ట్ లు, హీరో హీరోయిన్ మధ్య ట్రాక్, యాక్షన్స్ సన్నివేశాలు.
మైనస్ పాయింట్స్:
కొన్ని బోరింగ్ సీన్స్.అక్కడక్కడ రొటీన్ స్టోరీ లాగా అనిపిస్తుంది.కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది.
బాటమ్ లైన్:
చివరిగా చెప్పాల్సిందేంటంటే కాస్త స్లోగా అనిపించినా కూడా.ప్రేక్షకులకు కథ కొంతవరకు కనెక్ట్ అవుతుందని చెప్పవచ్చు.