వెండితెరపై కనిపించే నటీనటులు కేవలం సినిమాలో మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా నటిస్తూ ఉంటారు.తమ చుట్టూ ఉన్న పరిస్థితులను తమకు తగ్గట్టుగా మలుచుకుంటూ, ఎవరికి ఏం కావాలో, ఎలా సంపాదించుకోవాలి అని ఆలోచిస్తూ అడుగులు వేస్తూ ఉంటారు.
తనకు కావలసింది లభించిన తర్వాత అవతల వారికి సహాయం చేయడంలో మాత్రం ఎప్పుడు ముందుకు రావడానికి సిద్ధపడరు.అలాంటి నటీనటుల జాబితాలో హీరో నాని( Nani ) కూడా ఉన్నాడా అని అడిగితే ఖచ్చితంగా ఉన్నాడనే సమాధానం వస్తుంది.
తనకు అవసరం ఉన్న సమయంలో ఒక నిర్మాతను వాడుకొని ఆ తర్వాత అతనితో సినిమా తీస్తాను అని చెప్పి మొహం చాటేసిన సంఘటన ఇటీవల బయటకు వచ్చింది.

హీరో నాని పిల్ల జమిందార్( Pilla Jamindar ) అనే సినిమా తీసిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాకు నిర్మాతగా శ్రీనివాస్ రావు దొమ్మలపాటి వ్యవహరించారు.ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్ రైట్స్ కోసం నాని తీవ్రంగా ప్రయత్నించాడు.
పిల్ల జమిందార్ సినిమా తెలుగులో మంచి టాక్ రావడంతో ఓవర్సీస్ లో కూడా తన సొంత బావకి ఈ డిస్ట్రిబ్యూషన్ అప్పగించాలని భావించాడు.అందుకోసం నిర్మాతను సంప్రదించగా అతను కూడా సంతోషంగా ఓకే చెప్పాడు.
అందుకు బదులుగా డబ్బు ఎంత కావాలి అని అడిగితే నేను చాలా సంతోషంగా ఉన్నాను నానికి నేను ఓవర్సీస్ ని గిఫ్టుగా ఇస్తాను అని చెప్పాడు.నాకు డబ్బులు అక్కరలేదు కానీ మరో సినిమా డేట్స్ ఇవ్వాలని మాత్రం కోరాడట.
అందుకు ఓకే చెప్పిన నాని తన సొంత బావకే పిల్ల జమిందార్ ఓవర్సీస్ రైట్స్ ని విచ్చేశాడు.

అందుకు బదులుగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.అలా తన భావను సంతోష పరచడానికి నిర్మాత దగ్గర ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నాడు.కానీ ఆ తర్వాత డిఎస్ రావు( DS Rao ) మళ్ళీ సినిమా తీద్దాం అని అడిగితే ఒకసారి కూడా అందుకు అతనికి అవకాశం ఇవ్వలేదు.
ఇటీవల డిఎస్ రావు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను నాని ఎలా మోసం చేశాడు అనే విషయంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.నానికి అంత పెద్ద సహాయం చేస్తే కనీసం తన కోసం సినిమా కోసం డేట్స్ కూడా ఇవ్వలేదని బాధ పడ్డాడు.
అందుకే హీరోలు కేవలం తనకోసమే ఆలోచిస్తారు అని నిర్మాత ను కూడా పట్టించుకోరు అంటూ రావు తెలిపాడు.
