వైరల్ వీడియో: మందుబాబుల వీరంగం.. విమానంలో డబ్ల్యూడబ్ల్యూఈ తరహాలో ఫైటింగ్..

సామాన్యులకి అందుబాటులో తక్కువ ఉండే ప్రయాణంలో విమానాల ప్రయాణం( Flight Journey ) ఒకటి.ఏదైనా అత్యవసరమైన ప్రయాణాలు, లేకపోతే డబ్బు ఉన్నారు ప్రయాణాలు చేయడానికి మాత్రమే ఎక్కువగా విమానాల సర్వీస్ లు ఉంటాయి.

 Drunk Flight Passenger Loses Control Throws Punches At Cops And Flight Attendant-TeluguStop.com

ఇకపోతే ఈ మధ్యకాలంలో విమానాల్లో చాలాసార్లు అనవసరపు సంఘటనలు జరుగుతున్నాయి.వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా కనబడుతున్నాయి.

ఎక్కువగా విద్యావంతులు ప్రయాణించే విమాన సర్వీసులలో కూడా కొందరు హద్దులు దాటి మరీ ఎదుటివారిపై ప్రవర్తిస్తున్నారు.మరి కొందరైతే అచ్చం వీధి గొడవలు ఎలా జరుగుతాయో అలా ప్యాసింజర్లు కొట్టుకున్న సంఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా మనం చూసే ఉంటాం.

తాజాగా ఇందుకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

విమానంలో ప్రయాణిస్తున్న ఓ మందుబాబు( Drunkard ) వీరంగం సృష్టించాడు.విమానంలో ప్రయాణిస్తున్న తోటి ప్రయాణికులపై, అలాగే సిబ్బందిపై గొడవ పడుతూ వారిపై పిడిగుద్దులు వర్షం కురిపించాడు.దాంతో విమానంలో డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్( WWE Fighting ) వాతావరణం నెలకొంది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మద్యం సేవించిన ప్రయాణికుడు విమానం పైకప్పును బాదుతూ మరో వ్యక్తితో విమానంలో మొదట వాదనకు దిగాడు.దాంతో అతడని ఆపడానికి ప్రయత్నించిన పోలీసు అధికారి, మహిళ ఎయిర్లైన్ ఉద్యోగి పైన అతడు దాడి చేశాడు.

దాంతో ఇతర ప్రయాణికులు భయభ్రాంతులకు లోనయ్యారు.

ఈ గొడవ అనంతరం అసలు విషయానికి కారణమైన మందుబాబును అధికారులు విమానం నుంచి బయటకు దింపేశారు.ఎడిన్ బార్గ్ లో విమానం బయలుదేరినప్పటి నుంచి మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఓ ఫుట్బాల్ మ్యాచ్( Football Match ) జరుగుతున్న పోటీని చూస్తూ ఇతరులకు ఇబ్బందిని కలిగించాడు.దాంతో పక్కనే ఉన్న తోటి ప్రయాణిడు అతడి ప్రవర్తన పై అసహనం వ్యక్తం చేయగా వారి మధ్య మొదలైన వాగ్వివాదాం అనంతరం పెద్దగా మారి గొడవకు దారి తీసింది.

ఈ ఘటనపై సదరు విమాన అధికారులు స్పందిస్తూ.ప్రయాణికుడు విమానంలో ఇతరులకు కలిగించే ఇబ్బంది కారణంగా పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube