కాకినాడ నగరంలో ఓ కొరియర్ సంస్థ ద్వారా డ్రగ్స్ సరఫరా జరిగిన వ్యవహారం కలకలం రేపింది,సమాచారం పోలీసులకు తెలియడంతో లోతుగా ఆరా తియ్యగా, ఒక కొరియర్ సంస్థ నుంచి కొంత మోతాదులో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.వీటిని తెప్పించింది ఒకరేనా లేక ఈ వ్యవహారంలో ఇంకా భాగస్వాములు ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు,ఇప్పటికే ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.







