డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేసిన దృశ్యం 2

టాలీవుడ్‌లో రీమేక్ చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తుందని చాలాసార్లు రుజువు చేశారు ఇక్కడి ప్రేక్షకులు.ఇక రీమేక్ చిత్రాలు అంటే ఠక్కున గుర్తుకువచ్చే హీరో వెంకటేష్.

 Drishyam 2 First Look Motion Poster Gets A Date-TeluguStop.com

ఆయన తెలుగులో చాలా రీమేక్ చిత్రాలు చేసి తనదైన సక్సెస్ అందుకున్నారు.కాగా గతంలో మలయాళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘దృశ్యం’ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో కూడా రీమేక్ చేసి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు.

అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను రెడీ చేస్తు్న్నాడు వెంకీ.

 Drishyam 2 First Look Motion Poster Gets A Date-డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేసిన దృశ్యం 2-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే మలయాళంలో వచ్చిన ‘దృశ్యం-2’ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యి అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకుంది.

దీంతో ఈ సినిమా రీమేక్‌లో వెంకటేష్ మరోసారి నటిస్తున్నాడు.దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సినిమాను అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే తెలిపింది.

అయితే షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా నుండి తాజాగా ఓ అప్‌డేట్ వచ్చింది.ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ సెప్టెంబర్ 20న ఉదయం 10.08 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ తెలిపింది.

దృశ్యం చిత్రం తెలుగులోనూ మంచి క్రేజ్‌ను దక్కించుకోవడంతో, ఇప్పుడు దృశ్యం-2 చిత్రం ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక రాంబాబు పాత్రలో మరోసారి తన యాక్టింగ్‌తో అదరగొట్టనున్న వెంకీతో పాటు ఈ సినిమాలో మీనా కూడా నటిస్తోంది.ఈ సినిమాను కూడా మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.మరి ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

#Drishyam #Jeetu Joseph #Venkatesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు