దానిమ్మ పంట సాగు( Pomegranate Cultivation ) కు తెలుగు రాష్ట్రాల్లో ఉండే నేలలు చాలా అనుకూలంగా ఉండడంతో రైతులు ఈ పంట సాగు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.అంతేకాకుండా విదేశాలకు ఎగుమతి చేస్తూ అధిక లాభాన్ని పొందుతున్నారు.
దానిమ్మ సాగులో అధిక దిగుబడి పొందాలంటే ఎరువుల యజమాన్యంతో పాటు కొన్ని వ్యవసాయ పద్ధతులపై అవగాహన అవసరం.వీటిని అన్నింటిని దృష్టిలో పెట్టుకొని సకాలంలో సస్యరక్షక పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడి పొందవచ్చు.

దానిమ్మ పంటకు డ్రిప్ విధానం( Drip System ) ద్వారానే సాగునీరు అందించాలి.నీరు అధికంగా అందిస్తే కొత్త చిగురులు ఎక్కువగా వచ్చి బ్యాక్టీరియా, వైరస్ వ్యాధులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది.తరువాత వీటి ప్రభావం దానిమ్మకాయ దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.కావున అవసరాన్ని బట్టి నీటిని అందించాలి.
జనవరి, ఫిబ్రవరి నెలలలో వచ్చే పూతను బహార్ అని, జూన్, జూలై నెలలో వచ్చే పూతను హస్తబహర్ అని అంటారు.ఏదో ఓ సీజన్లో పూతను ఆపుకొని దిగుబడిని పొందాలంటే.
నీటి ఎద్దడి, వేర్లను బహిర్గతం చేయడం, వేర్లను కత్తిరించడం వంటి పద్ధతులు అనుసరించాలి.అధిక దిగుబడి పొందవచ్చు.
జనవరి, ఫిబ్రవరి నెలలలో కాపు చేతికి రావాలంటే జూన్ నెల నుండి నీటి తడులు అందించడం తగ్గించాలి.సెప్టెంబర్ నెలలో వేర్లు కత్తిరించడం, కత్తిరించడం, అవసరమైన ఎరువులు అందించాలి.

దానిమ్మ చెట్టు పూత, పిందె కాయలు రాలకుండా ఉండడం కోసం ఒక లీటర్ నీటిలో 2000పిపిఎమ్ ఇథేఫాన్ 2గ్రా కలిపి పిచికారి చేయాలి.రసాయనాలను వాడేటప్పుడు జాగ్రత్త వహించాలి.మోతాదుకు మించి వాడితే పూత రాలిపోయే ప్రమాదం ఉంది.నేలలో ఉండే తేమశాతంలో హెచ్చుతగ్గులు అధికంగా ఉంటే కాయలు పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది.కాబట్టి కాయ ఎదిగే దశలో 100 లీటర్ల నీటిలో ఒక కిలో కాల్షియం క్లోరైడ్ మరియు ఒక కిలో మెగ్నీషియం క్లోరైడ్ కలిపి పంటకు పిచికారి చేయాలి.ఆ తరువాత ఒకటిన్నర కిలో డి.ఎ.పి మరియు 0.5 కిలో మెగ్నీషియం సల్ఫేట్ ను 100 లీటర్ల నీటిలో కలిపి పంటకు పిచికారి చేస్తే కాయ పగుళ్లను నియంత్రించవచ్చు.ఇంకా అవసరం ఉంటే వంద లీటర్ల నీటిలో 90 మిల్లీ లీటర్ల సైటోజెమ్, 100 గ్రాముల బోరాక్స్( Borax ) కలిపి పంటకు పిచికారి చేయాలి.
ఈ పద్ధతులను సకాలంలో జాగ్రత్తగా పాటిస్తే అధికమైన నాణ్యత గల దిగుబడి పొందవచ్చు.







