విడ్డూరం : ఒకప్పుడు మద్యం పొగ తాగేవారి కోసం ఉండేవి ఇప్పుడు మొబైల్‌ యూజర్లకు వచ్చాయి

ఒకప్పుడు, ఇప్పుడు కూడా మద్యంకు బానిసై, పొగ తాగకపోతే బతకలేకుండా జీవితాన్ని నాశనం చేసుకునే వారికి, డ్రగ్స్‌ అలవాటు ఉన్న వారికి డి అడిక్షన్‌ సెంటర్స్‌ అనేవి ఉండేవి.ఈ సెంటర్స్‌లలో తాము ఆ చెడు అలవాట్లను పోగొట్టుకోవాలనుకుంటే చేరాల్సి ఉంటుంది.

ఈ సెంటర్లలో ఉండే పరిస్థితులు, అక్కడి వారి ట్రీట్‌మెంట్‌ ఇతరత్ర కారణాల వల్ల మద్యం మరియు పొగ తాగే అలవాటు నుండి పూర్తిగా విముక్తి అవ్వొచ్చు.ఇలా డ్రగ్స్‌ అలవాటు నుండి బయట పడ్డ వారు కూడా చాలా మంది ఉన్నారు.

ఇప్పుడు మొబైల్‌కు బానిసలైన వారి కోసం కూడా ఇలాంటి డి అడిక్షన్‌ సెంటర్‌లు ప్రారంభం అవుతున్నాయి.

విడ్డూరం : ఒకప్పుడు మద్యం పొగ �

విదేశాల్లో ఇప్పటికే అక్కడక్కడ ఉన్న ఈ మొబైల్‌ డి అడిక్షన్‌ సెంటర్స్‌ ఇండియాలో ప్రారంభం అవుతున్నాయి.తాజాగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఒక హాస్పిటల్‌లో ఈ డి అడిక్షన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లుగా డాక్టర్‌ జే పాల్‌ పేర్కొన్నారు.సైక్రియార్టిస్టు అయిన పాల్‌ ప్రస్తుతం యువత ఎదుర్కొన్న అతి పెద్ద సమస్య అయిన మొబైల్‌ అడిక్షన్‌ నుండి బయట పడేసేందుకు తాము ఒక ప్రయోగాత్మక పద్దతిని కనిపెట్టామని అంటున్నారు.

ఈ పద్దతిలో వారి మైండ్‌పై ఎలాంటి ప్రభావం పడకుండా జాగ్రత్తగా మొబైల్‌ అడిక్షన్‌ నుండి బయట పడేస్తామని అంటున్నారు.

విడ్డూరం : ఒకప్పుడు మద్యం పొగ �

ప్రస్తుతం పెరిగిన మొబైల్‌ పరిధి నేపథ్యంలో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అంతా కూడా మొబైల్స్‌ విపరీతంగా వాడేస్తున్నారు.అవసరం ఉన్నా లేకున్నా కూడా ఈ మొబైల్స్‌ను ఎప్పుడు చేతిలోనే పెట్టుకుని ఆడేస్తున్నారు.ఇప్పుడు అలాంటి పద్దతికి ఫుల్‌ స్టాప్‌ పెట్టడం జరుగుతుంది.

ఎందుకంటే ఈ డి అడిక్షన్‌ సెంటర్స్‌ వస్తున్న కారణంగా ఇకపై ఎక్కువ శాతం వాటికి తమ పిల్లలను తీసుకు వెళ్తారని అంటున్నారు.డాక్టర్‌ పాల్‌ తమ వద్దకు ఎక్కువ శాతం టీనేజర్స్‌ మరియు చిన్న పిల్లలు వస్తున్నారని అన్నాడు.

రెండు మూడు ఏళ్ల పిల్లలు కూడా విపరీతమైన మొబైల్‌ అడిక్షన్‌ అయిన నేపథ్యంలో పిల్లల తల్లిదండ్రులు టెన్షన్‌ పడుతున్నారు.తప్పనిసరి పరిస్థితుల్లో చేసేది లేక వారిని ఏం అనలేక పోతున్నారు.

వారి కోసం ఈ డి అడిక్షన్‌ సెంటర్లు బాగా ఉపయోగపడతాయి.కాస్త ఆగితో తెలుగు రాష్ట్రాల్లో కూడా మొబైల్‌ డి అడిక్షన్‌ సెంటర్లు పడే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube