ఎంపీ అభ్యర్థులపైనా అనుమానాలే ? కేసీఆర్ ఏ వ్యూహం అమలు చేస్తున్నారంటే ? 

ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీ( BRS party ) నుంచి పెద్ద ఎత్తున వలసలు పెరగడం , రోజురోజుకు కాంగ్రెస్ బలం పెంచుకుంటూ ఉండడం వంటివి బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు ఆందోళన కలిగిస్తున్నాయి.పార్టీ కీలక నాయకులనుకున్నవారు , ఎమ్మెల్యేలు , మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు , మాజీ మంత్రులు ఇలా చాలామంది ఇప్పటికే పార్టీ మారిపోయారు.

 Doubts On Mp Candidates? What Strategy Is Kcr Implementing, Kcr, Brs Congres, Bj-TeluguStop.com

ఇంకా అనేకమంది సరైన సమయం చూసుకొని పార్టీ మారే ఆలోచనతో ఉన్నారు.ఇదిలా ఉంటే బీఆర్ఎస్ తరఫున ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించిన వారిలో కొంతమంది చివరి నిమిషంలో పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరడాన్ని కెసిఆర్ సీరియస్ గానే తీసుకున్నారు.

పార్టీ టికెట్ దక్కించుకున్న వారెవరు నామినేషన్ సమయంలో, ఆ తరువాత పార్టీ మారకుండా ముందుగానే జాగ్రత్త చర్యలకు శ్రీకారం చుట్టారు.

Telugu Brs, Brs Mp Candis, Harish Rao, Revanth Reddy-Politics

ఒకవేళ నామినేషన్ దాఖలు సమయంలో అభ్యర్థులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే ప్రత్యామ్నాయ అభ్యర్థులను బరిలోకి దించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు.  తాజాగా కేసీఆర్ నంది నగర్ నివాసంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) ,మాజీ మంత్రి హరీష్ రావుతో ప్రత్యేకంగా భేటీ అయిన ఆయన ఎన్నికల ప్రచార సభలు,  బస్సు యాత్ర షెడ్యూల్ తో పాటు,  తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు పై క్షుణ్ణంగా చర్చించారు.లోక్ సభ ఎన్నిక పోలింగ్ నాటికి ఒకరిద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు , కొంతమంది కీలక నేతలు పార్టీ వీడే అవకాశం ఉందన్న ముందస్తు సమాచారం పైన చర్చించారు.

ఎమ్మెల్యేలు లేదా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీలు పార్టీ మారనచోట లోక్ సభ ఎన్నికల ప్రచారం, సమన్వయ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేసేందుకు తీసుకోవాల్సిన వ్యవహారపైన చర్చించారు.ఎన్నికల నిధులను  అభ్యర్థుల చేతు మీదుగా కాకుండా , పార్టీ పర్యవేక్షణలోనే జరిగేలా చూడాలని కేసిఆర్ ఆదేశాలు జారీ చేశారు.

Telugu Brs, Brs Mp Candis, Harish Rao, Revanth Reddy-Politics

ఇక ఈ నెల 22 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు చేసే బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ పైన కేసీఆర్ ( kcr )చర్చించారు .బస్సు యాత్ర చేయాల్సిన మార్గం ఏ ఏ తేదీల్లో ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి అనే విషయాల పైన చర్చించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube