టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannath) ప్రస్తుతం ప్లాప్ సినిమాలను ఎదుర్కొని ఎంతో ఇబ్బందులలో ఉన్నారని చెప్పాలి.రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar) సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈయన తన తదుపరి సినిమాని ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కించారు.
ఈ విధంగా పూరి కనెక్ట్స్ బ్యానర్లో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా పాన్ ఇండియా స్థాయిలో లైగర్ (Liger)అనే సినిమాకు దర్శకత్వం వహించారు అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ ఎదుర్కొంది.

ఈ సినిమా డిజాస్టర్ కావడంతో పూరి జగన్నాథ్ మరోసారి ఇబ్బందులలో పడ్డారు.ఇక పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రావాల్సిన జనగణమన సినిమా కూడా ఆగిపోయింది.దీంతో ఈయన ఈసారి సినిమా చేస్తే ఎలాగైనా హిట్ కొట్టాలన్న ఆలోచనలో ఉన్నారు.
దీంతో తిరిగి ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ చిత్రాన్ని చేయబోతున్నట్లు ఛార్మి (Charmi) అధికారికంగా ప్రకటించారు.అయితే త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది.

ఇక రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా జూలై 9వ తేదీ ఘనంగా పూజా కార్యక్రమాలను ప్రారంభించుకోబోతుందని తెలుస్తోంది.అనంతరం జూలై 12వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు జరుపుకుంటుంది.ఈ క్రమంలోనే రామ్ పూరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపైనే ఆయన ఆశలని పెట్టుకున్నారు.ఈ సినిమా ద్వారా ఎలాగైనా సక్సెస్ కొట్టాలని భావిస్తున్నారు.ఇక ఈ సినిమాలో రామ్ హీరోగా నటించగా హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అన్ని వివరాలు కూడా తెలియజేయనున్నారు.