కాలం మారుతున్న కొద్దీ ప్రజల అభిరుచులు మారుతున్నాయి.ఫుడ్( Food ) విషయంలో కూడా కొత్త టేస్టులను ప్రజలు కోరుకుంటున్నారు.
వారి కోసం వీధి వ్యాపారులు కూడా కొత్త కొత్త రుచులను పరిచయం చేస్తున్నారు.ఫుడ్ కాంబినేషన్స్ అంటూ దేన్ని పడితే దాన్ని కలిపేస్తున్నారు.
అయితే వీటిలో చాలా వరకు తినలేనంత ఘోరంగా ఉంటున్నాయి.అలాంటి ఫుడ్ రెసిపీస్ ఎక్స్‌పరిమెంట్స్‌కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
తాజాగా ఆ కోవకు చెందిన ఒక వీడియో వైరల్ గా మారింది.
వైరల్ వీడియోలో ఒక స్ట్రీట్ వెండార్( Street Vendor ) ఒక వెరైటీ ఫుడ్ చేయడానికి సిద్ధమవుతుండటం చూడవచ్చు.అతడు ఈ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఐస్‌క్రీమ్‌ను( Ice Cream ) మొదటగా తీసుకున్నాడు.తర్వాత ఒక వేడి వేడి పెనంపై దోశ పిండిని వేశాడు.
అనంతరం ఆ పిండిపై చాక్లెట్ క్రీమ్ అప్లై చేశాడు.ఆపై దోశను బాగా ఎర్రగా కాల్చాడు.
దాన్ని మధ్యలో కట్ చేసి, ఆ హాఫ్ దోశను గుండ్రని ఐస్‌క్రీమ్ కోన్ లాగా చుట్టాడు.ఆ దోశ కోన్‌లో ఆల్రెడీ తయారు చేసి పక్కన పెట్టుకున్న ఐస్‌క్రీమ్ నింపాడు.
చివరికి ఈ ఫుడ్ ఐటెమ్‌పై చాక్లెట్ ముక్కలు, చాక్లెట్ క్రీమ్ చల్లాడు.
ఆ తర్వాత దాన్ని కస్టమర్లకు అందజేస్తాడు.చూసేందుకు ఇది అందంగా కనిపించినా తినేందుకు మాత్రం బాగుండదని ఈ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.సాధారణంగా ఐస్ క్రీమ్ చల్లగా ఉంటుంది దోశ మాత్రం వేడిగా ఉంటుంది.
వీటి రెండు టేస్టులు కూడా పూర్తి భిన్నంగా ఉంటాయి.మధ్యలో చాక్లెట్( Chocolate ) యాడ్ చేయడం కూడా టేస్ట్ ను పూర్తిగా మార్చేస్తుంది.
మొత్తంగా ఈ ఫుడ్ ఐటెమ్ రుచి ఎలా ఉంటుందనేది తమ ఊహకే అందడం లేదని ఇంటర్నెట్ యూజర్లు కామెంట్లు పెడుతున్నారు.ఈ ఐస్ క్రీమ్ తింటే టిఫిన్ కూడా చేయాల్సిన పని ఉండదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.