చాలా సినిమాలకి డిఒపి గా చేసి డైరెక్టర్లు అయిన వాళ్లు వీరే...

సినిమా ఇండస్ట్రీ లో 24 క్రాఫ్ట్స్ వారు అందరూ ఆ సినిమా డైరెక్టర్ చెప్పినట్లు గా చేయాల్సి ఉంటుంది ఒక సినిమా మొత్తానికి హెడ్ డైరెక్టర్ కాబట్టి ఆయన ఏం చెపితే అది చేసి పెట్టీ ఆయన చేసే సినిమాకి సహకరించడమే మిగితా డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే పని.

అందుకే డైరెక్టర్ ని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు.

అందుకే ఏ డిపార్టుమెంటు లో చేసేవాళ్ళు అయిన లైఫ్ లో ఒకసారైనా డైరెక్షన్ చేయాలి అనుకుంటారు కొందిరికైతే డైరెక్షన్ చేయడమే ఇంట్రెస్ట్ అయినప్పటికీ బతకడానికి మధ్యలో ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు.

అయితే ఇండస్ట్రీ లో ఎడిటర్స్ డాన్సర్స్,కెమెరామెన్ లు ఇలా చాలా మందే డైరెక్టర్స్ అయ్యారు దాంట్లో కెమెరా డిపార్ట్మెంట్ నుంచి ఎవరు డైరెక్టర్ అయ్యారో ఒకసారి తెలుసుకుందాం.మొదటగా రసూల్ ఎల్లోర్ ఈయన ఇండియా లోనే టాప్ సినిమాటోగ్రాఫర్ అని చెప్పాలి ఈయన రవితేజ ను హీరో గా పెట్టీ భగీరథ అనే సినిమా తీశారు, ఆ తర్వాత శ్రీరామ్ హీరో గా ఒకరికి ఒకరు అనే సినిమా కూడా తీశారు ఈ రెండు సినిమాలు బాగున్నప్పటికీ కమర్షియల్ గా రెండు సినిమాలు వర్క్ ఔట్ కాకపోవడంతో డైరెక్టర్ గా ఆయన సక్సెస్ కాలేకపోయాడు దాంతో మళ్ళీ సినిమాలకి డిఓపి గా చేస్తున్నాడు

ఇక నెక్స్ట్ సంతోష్ శ్రీనివాస్ గురించి చెప్పాలి ఈయన అమ్మ రాజ శేఖర్ డైరెక్షన్ లో వచ్చిన టక్కరి సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా చేశాడు అది ప్లాప్ అయింది.దాంతో రామ్ ని హీరో గా పెట్టీ కందిరీగ అనే సినిమాతో డైరెక్టర్ గా మారాడు.ఇది మంచి సక్సెస్ అయింది దాంతో ప్రస్తుతం డైరెక్టర్ గా కొన్ని సినిమాలు చేస్తున్నాడు.

Advertisement

శివ తెలుగు సినిమా అయిన తమ్ముడిని పి ఏ అరుణ్ ప్రసాద్ గారు బద్రి పేరుతో తమిళ్ లో విజయ్ తో రీమేక్ చేశారు దానికి ఈయన సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు.ఆ తరువాత గోపిచంద్ హీరోగా శౌర్యం అనే సినిమా తీశాడు అది సూపర్ హిట్ అయింది.

దాంతో శంఖం, దరువు అనే సినిమాలు తీశాడు.అజిత్ తో వీరం, వేదలం, విశ్వాసం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తీశాడు.

Advertisement

తాజా వార్తలు