బిజెపికి వేసి ఓటు వృధా చేయొద్దు :హరీష్ రావు!

తెలంగాణలో బిజెపి ( Telangana BJP )అధికారం లోకి వచ్చే అవకాశమే లేదు అని, అలాంటప్పుడు ఆ పార్టీకి ఓటు వేసి ఓటు వృధా చేయొద్దంటూ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు బి ఆర్ఎస్ కీలక నేత, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు.హుజురాబాద్ నియోజకవర్గం లో పాడి కౌశిక్ రెడ్డి( Padi Kaushik Reddy )కి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న హరీష్ రావు ఈ విధంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

 Don't Waste Your Vote For Bjp Harish Rao , Harish Rao , Brs Party , Cm Kcr-TeluguStop.com

తెలంగాణలో ఇప్పటి వరకూ జరిగిన అభివృద్ధి అంతా బిఆర్ఎస్ హాయము లోనే జరిగిందని, గత ఉప ఎన్నికలలో సానుభూతి సంపాదించి గెలిచిన ఈటెల రాజేందర్( Etela Rajender ) హుజూరాబాద్ కు ఒక పనైనా చేశారా.

Telugu Bjp, Cm Kcr, Congress, Etela Rajender, Harish Rao, Telangana Bjp-Telugu P

అంటూ ప్రజలను ప్రశ్నించారు .ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదు కానీ గజ్వేల్ వెళ్లి కేసిఆర్ పై పోటీ చేస్తాడట, పెద్దలపై పోటీ చేసి పెద్దవాడిని అవుదాం అనుకుంటున్నాడు అంటూ విమర్శించారు.ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా కేసీఆర్( CM kcr ) మరోసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, ఉప ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజలకు మద్దతుగా నిలిచి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు జరిగేలా చూసిన కౌశిక్ రెడ్డి గెలుపు ఈ సారి ఖాయమంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Telugu Bjp, Cm Kcr, Congress, Etela Rajender, Harish Rao, Telangana Bjp-Telugu P

కాంగ్రెస్కు ఓటు వేస్తే ప్రతి చిన్న పనికి ఢిల్లీ వెళ్ళి అనుమతులు తీసుకోవాలని, బి ఆర్ఎస్ ( BRS )మీ గుమ్మంలో ఉండి పనులు చేసి పడుతుందంటూ ఆయన చెప్పుకొచ్చారు.ఎలక్షన్ కమిషన్ ను అడ్డుపెట్టుకొని రైతు రుణమాఫీలను, రైతుబంధును కాంగ్రెస్ ఆపించేసిందని ,కాంగ్రెస్ రైతులను అవమానిస్తుంటే బి ఆర్ఎస్ రైతులకు విలువలు పెంచుతుందంటూ ఆయన చెప్పుకొచ్చారు.మాట్లాడితే తెలంగాణ ఆత్మ గౌరవం అంటూ చెప్పుకొచ్చే ఈటెల రాజేందర్ మరి సమైక్యవాదులతో పొత్తుకొట్టుకున్న భాజపా విధానాలను ఎందుకు ప్రశ్నించడం లేదని, ఆయన హుజూరా బాద్ లోనూ గజ్వేల్ లోనూ రెండు చోట్ల ఓడి రెంటికి చెడ్డ రేవడి అవుతాడని హరీష్ రావు ( Harish Rao )జోష్యం చెప్పారు. బి ఆర్ఎస్కు ఓటు వేసి హుజురాబాద్ తో పాటు తెలంగాణను కూడా అభివృద్ధి చేసుకుందామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube