వేసవిలో ఇవి తీసుకోవద్దు... డీహైడ్రేషన్, అనారోగ్యం కలుగుతాయి!

రెండు తెలుగు రాష్ట్రాలలో వేసవి భగభగలు ప్రతిచోటా షురూ అయ్యాయి.ఈ క్రమంలో చాలామంది డీహైడ్రేషన్ కి గురై అనేక ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు.

అయితే దానికి కారణం వారి ఆహారపు అలవాట్లే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ముఖ్యంగా వేడి వాతావరణంలో నివారించేందుకు పోషకాహార నిపుణులు కొన్ని సలహాలు చెబుతున్నారు.

ప్రతి సీజన్‌లో హైడ్రేటెడ్‌గా ఉండటం అనేది చాలా ముఖ్యం.అయితే వేసవిలో అన్నింటికంటే ఎక్కువ ప్రాముఖ్యత తీసుకోవాలి.

వేడిని తట్టుకునేందుకు మన ఆరోగ్యాన్ని మంచిగా ఉంచడానికి ద్రవాలు, మరియు ఇతర హైడ్రేటింగ్ ఆహారాలను తీసుకోవడం ఎంతైనా అవసరం.

Dont Take These In Summer...causes Dehydration And Sickness , Summer, Effect,
Advertisement
Don't Take These In Summer...causes Dehydration And Sickness , Summer, Effect,

ఈ మండుటేసవిలో దాహం వేయనప్పుడు కూడా నీటిని తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌తో పోరాడవచ్చు.ఇక్కడ ఆహారం.ముఖ్యంగా స్నాక్స్‌, భోజనాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం.

అధిక ప్రొటీన్‌లు కలిగిన ఆహారాలు, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, కెఫిన్‌తో( Caffeine ) కూడిన పానీయాలు, డార్క్ చాక్లెట్‌లు డీహైడ్రేషన్‌ను నివారించడానికి తినకూడదని నిపుణులు అంటున్నారు.మీరు మీ ఆహారంలో హైడ్రేటింగ్ ఆహారాలను జోడించకుండా నిర్జలీకరణానికి కారణమయ్యే ఆహారాన్ని తినడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదని వారు అంటున్నారు.

Dont Take These In Summer...causes Dehydration And Sickness , Summer, Effect,

మనందరికీ కాఫీ అంటే చాలా ఇష్టం.కానీ వేసవిలో దీన్ని సేవించడం మంచిదికాదని నిపుణులు చెబుతున్నారు.అదేవిధంగా ఆల్కహాల్( Alcohol ) దానికి సంబంధించినటువంటి ఉత్పత్తులు కూడా మంచిది కాదని అంటున్నారు.

ఇక ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం కూడా మిమ్మల్ని డీహైడ్రేషన్‌గా ఉండేలా చేస్తుంది అని చెబుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!

ఇక మిల్క్, వైట్ చాక్లెట్ రెండింటి కంటే డార్క్ చాక్లెట్‌లో కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.పెద్ద మొత్తంలో డార్క్ చాక్లెట్( Dark Chocolate ) తీసుకోవడం వల్ల హృదయ స్పందన రేటు పెరగడం, విరేచనాలు, ఆందోళన, చిరాకు, భయము, నిర్జలీకరణానికి దారితీస్తుంది.కాబట్టి ఇటువంటి ఆహారాలను ఈ వేసవిలో తీసుకోవడం ఏమంత మంచిది కాదని సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు