పండగలకు ఓటీటీల్లో  విడుదల చేయకండి. థియేటర్ ఓనర్స్ విజ్ఞప్తి..

పండగలకు ఓటీటీల్లో  విడుదల చేయండి.థియేటర్ ఓనర్స్ విజ్ఞప్తి మేం ఓటీటీకు వ్యతిరేకం కాదు.

వారి బిజినెస్ వారిది.పండగలకు సినిమాలను ఓటీటీలో విడుదల చేయకండి అని తెలంగాణ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.

ఈ సమావేశంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్, సెక్రటరీ సునీల్ నారంగ్, జాయింట్ సెక్రటరీ బాల గోవిందరాజ్, టి ఎఫ్ సీ సీ సభ్యుడు అనుపమ్ రెడ్డి, సెక్రటరీ విజయేందర్ రెడ్డి నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు, జెమిని కిరణ్ తదితరులు పాల్గొన్నారు.నిర్మాత చదలవాడ మాట్లాడుతూ.

రామారావు, నాగేశ్వరరావు ఇప్పుడు లేకపోయినా వాళ్ళ సినిమాలు ఆడిన థియేటర్స్ ఇప్పటికీ ఉన్నాయి.నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ మధ్య అవినాభావ సంబంధం ఉంది.

Advertisement

సినిమా అనుభూతి అనేది ఓటీటీ కంటే థియేటర్లోనే బాగా ఉంటుంది.నిర్మాతలకు నా విజ్ఞప్తి ఓటీటీలను ఎవైడ్ చేద్దాం.

సెప్టెంబర్ 10న లవ్ స్టోరీ రిలీజ్ అవుతున్నప్పుడు టక్ జగదీష్ చిత్రం అదే రోజున విడుదల చేయడం సరికాదన్నారు.సునీల్ నారంగ్ మాట్లాడుతూ.

మా లవ్ స్టోరీ సినిమాని సెప్టెంబర్ 10న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాం.కానీ అదే రోజున టక్ జగదీష్ సినిమా ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు తెలిసింది.

నాకు ఎలాంటి సమస్య లేదు అయితే భవిష్యత్తులో మాత్రం ఇలాగే కొనసాగడం కష్టం.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్ కు డబ్బులు కట్టలేని పరిస్థితి వస్తుంది.ఈ పరిస్థితి నిర్మాతలకు అర్థం కావడం లేదు.కాబట్టి మేం నిర్మాతలను సపోర్ట్ చేయమని కోరుతున్నాం.

Advertisement

మేం  ఓటీటీల వ్యతిరేకం కాదు.వారి బిజినెస్ వారిది.

పండగలకు సినిమాలను ఓటీటీలో విడుదల చేయకండి.థియేటర్లో విడుదల చేయండి.

లవ్ స్టోరీ సినిమాను సాఫీగా విడుదలయ్యేలా చూడండి అన్నారు.నా సినిమా థియేటర్ లో రిలీజ్ చేయడం నాకిష్టం అని ఇప్పుడు నిర్మాతల ఇష్టం అంటున్నారు అని శ్రీధర్ అన్నారు.

గోవిందరాజ్ మాట్లాడుతూ బాహుబలి లాంటి సినిమా ఓటీటీలో రిలీజ్ అయితే ఇంత పేరు వచ్చేదా.ఓటీటీ వల్ల టాలీవుడ్ కి చాలా నష్టం.

మేము నిర్మాతలకు అక్టోబర్ వరకు  ఆగమని చెప్పమన్నారు.

తాజా వార్తలు