వైరల్: కుక్కతో పెట్టుకోవద్దురోయ్... బొడ్డుచుట్టూ 16 ఇంజెక్షన్లు చేయించుకోవాలి!

Don't Keep It With The Dog.16 Injections Around The Belly! Dog, Viral Latest, News Viral, Social Media Viral Photos, Viral Video, Dog, Playing

సోషల్ మీడియా వచ్చాక రకరకాల కంటెంట్ వీడియోల రూపంలో జనాల ముందు ప్రత్యక్షం అవుతోంది.అందులో కొన్ని వీడియోలు సరదాగా అనిపిస్తే, కొన్ని సీరియస్ గా ఉంటాయి.

 Don't Keep It With The Dog.16 Injections Around The Belly! Dog, Viral Latest, Ne-TeluguStop.com

కొన్ని వీడియోలు ఆశ్చర్యంగా ఉంటే మరికొన్ని భయంకరంగా ఉంటాయి.కొన్ని విచిత్రంగా ఉంటే, మరికొన్నిటిని చూసినపుడు మాత్రం చాలా కోపం వస్తుంది.

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది.అవును, కుక్కలు మనుషులకు నేస్తాలు.

వాటివలన ఉపయోగమే కానీ, నిరుపయోగం ఉండదు.వాటి జోలికి వెళ్తే గాని, అవి మనుషుల జోలికి పోవు.

అలాంటి కుక్కతో పరాచికాలు ఆడితే ఎవరికన్నా కోపం వస్తుంది కదా.ఇక్కడ అదే జరిగింది.వైరల్ అవుతున్న వీడియోని చుస్తే ఓ కుక్క పిల్ల కాళ్లను ఓ అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ కలిసి చెరోవైపు పట్టుకుని దానిని గాల్లో బొమ్మలా గిరిగిరా తిప్పుతూ నవ్వుతూ కేరింతలు కొట్టడం కనిపిస్తోంది.కుక్కపిల్లను ఆ యువకుడు రెండు కాళ్లతో వేలాడదీస్తూ, గాలిలో తిప్పుతూ వికృతానందం పొందడం ఇందులో చూడవచ్చు.

అక్కడితో ఆగకుండా వారు వెళ్లే మార్గంలో ఓ పెద్ద గోడ వెనుక కోతులు ఉంటే, వాటికి ఆ కుక్కపిల్లను చూపించి వాటిని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

కాగా ఈ వీడియోను IAS అధికారి ‘అవనీశ్‌ శరణ్‌‘ ట్విట్టర్‌ వేదికగా పోస్టు చేస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.వీళ్లలో మనుషులెవరో జంతువు ఎవరో మీరే చెప్పండి? అంటూ తను పోస్ట్‌కి క్యాప్షన్‌ పెట్టారు.ఇక ఈ వీడియో చూసి నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు.

కొందరు కుక్కపిల్లను హింసించినవారితోపాటు, ఈ వీడియో తీసిన వ్యక్తిని కూడా అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలంటూ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు.మరికొందరు స్పందిస్తూ… అనుమానమే లేదు.

ముగ్గురూ జంతువులే అంటూ కామెంట్‌ చేశారు.వేరొకరు స్పందిస్తూ… కుక్కతో పెట్టుకోవద్దురోయ్… బొడ్డుచుట్టూ 16 ఇంజెక్షన్లు చేయించుకోవాలి! అంటూ వాళ్ళని హెచ్చరిస్తూ కామెంట్ చేసాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube