ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి.రేవంత్ రెడ్డి (Revanth reddy) ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విపరీతంగా విరుచుకుపడుతున్నాయి.
ఇదే తరుణంలో ఓవైపు అధికార పక్షంపై , మరోవైపు ప్రతిపక్షం మాటల యుద్ధమే చేస్తూ ఉందని చెప్పవచ్చు.ప్రభుత్వం ఏర్పడి కొన్నాళ్లు కూడా కాకముందే ప్రతిపక్షాలు విమర్శన ఆస్త్రాలు చేయడం, అధికారపక్షం వాటిని ఖండిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.
ఇదే తరుణంలో విద్యుత్ బకాయిలపై గురువారం అసెంబ్లీలో వాడి వేడి చర్చలు జరిగాయి.ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ ( Akbaruddin Owaisi ) మధ్య కాసేపు వార్ నడిచింది.
ఇదే తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీకి బీ టీం ఎంఐఎం అంటూ చెప్పుకొచ్చారు.ఈ క్రమంలోనే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ మేము బతికి ఉన్నంతకాలం బిజెపితో కలిసి పని చేసేది లేదని తేల్చి చెప్పారు.అనంతరం సీఎం మాట్లాడుతూ మొండి బకాయిల్లో సిరిసిల్ల,సిద్దిపేట( Siddipeta ) , గజ్వేల్,హైదరాబాద్, మొదటి స్థానంలో ఉన్నాయన్నారు.అంతేకాకుండా శ్రీశైలం ఎడమ కాలువలో సొరంగం బ్లాస్ట్ అయి తొమ్మిది మంది మరణించారని, అందులో ఏఈ ఫాతిమాకు కూడా చనిపోయిందని రేవంత్ రెడ్డి ఓవైసీకి గుర్తు చేశారు.
దానిపై నోరెత్తని ఎంఐఎం ఎందుకు ఇప్పుడు మాట్లాడుతోందని సీఎం ప్రశ్నించారు.అనంతరం అక్బరుద్దీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ గవర్నమెంట్ మమ్మల్ని తీవ్రంగా అణచివేసే ప్రయత్నం చేస్తుందని, అయినా భయపడేది లేదని, కిరణ్ కుమార్ రెడ్డి ( Kiran kuma reddy ) సీఎంగా ఉన్నప్పుడు జైల్లో పెట్టించిన మేము భయపడలేదని ఓవైసీ అన్నారు.ఎంఐఎం (MIM) బిజెపికి బీ టీం అంటున్నారని తాము బతికున్నంత వరకు బిజెపితో కలిసి పని చేసేది లేదని తేల్చి చెప్పారు.ముస్లింల హక్కుల కోసమే ఎంఐఎం ఎప్పుడు పోరాడుతుందని అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు.
ఈ విధంగా అక్బరుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డి మధ్య అసెంబ్లీలో వాడి వేడి చర్చ సాగింది.