కొంప ముంచిన ట్రంప్ ర్యాలీ...ఒక్క రోజులో 30 వేల కేసులు నమోదు..!!!!

అమెరికాలో కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గేలా కనిపించడం లేదు.ఊహించని స్థాయిలో కరోనా మహమ్మారి అమెరికాపై దాడి చేస్తూనే ఉంది.

కరోనా తగ్గిపోయిందంటూ ప్రజలు ఎదేశ్చగా రోడ్లపై తిరిగేస్తున్నారు.ఎక్కడా కూడా లాక్ డౌన్ పాటిస్తున్న సంఘటనలు కన్పించడం లేదు.

అమెరికా ఆర్ధిక రాజధానిలో కేసుల సంఖ్య తగ్గుతున్న క్రమంలోనే మళ్ళీ కేసులు సంఖ్య పెరగడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.కేవలం నిన్నటి ఒక్క రోజులోనే సుమారు 30 వేల కేసులు నమోదు కావడం సంచలనం సృష్టించింది.

జాన్ హాపీన్స్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం చూస్తే అమెరికాలో దాదాపు మే నెల మొదటి నుంచీ ఇప్పటి వరకూ ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే మొదటి సారని తెలిపింది.ఆరిజోనా, ఫ్లోరిడా , కాలిఫోర్నియా , సౌత్ కరోలినా ప్రాంతాలలో అత్యధిక స్థాయిలో కేసులు నమోదయ్యాయని తెలిపింది.

Advertisement

ఈ ప్రభావం ఓ ప్రవాహంలా ఉందని కరోనా తగ్గు ముఖం పట్టకుండానే ప్రజలని రోడ్లపై తిరగనివ్వడం వలనే ఈ స్థాయిలో కేసులు నమోదు అయ్యాయని పరిశోధకులు తెలిపారు.

ఇదిలాఉంటే ట్రంప్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక్లహామా లోని టాల్సా లో భారీ ఎత్తున జన సమీకరణ ఏర్పాటు చేసి ప్రజలని ఉద్దేశించి మాట్లాడారు.ఈ సమయంలో ట్రంప్ ర్యాలీకి వేలాది మంది ప్రజలు వచ్చారని.వీటికి కరోనా సోకే ప్రమాదాలు లేకపోలేదని అంటున్నారు నిపుణులు.

అదే గనుక జరిగితే భవిష్యత్తులో మరింతగా కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.మొత్తానికి ట్రంప్ ర్యాలీ అమెరికా ప్రజల కొంప ముంచిందిగా అంటున్నారు నెటిజన్లు.

బెడ్‌రూమ్‌లో రాక్షసి ఉందనుకున్న చిన్నారి.. తీరా వెతికితే ఊహించని షాక్..?
Advertisement

తాజా వార్తలు