Donald Trump Hush Money Trial: న్యూయార్క్ కోర్టులో ట్రంప్‌కు చుక్కెదురు

హష్ మనీ క్రిమినల్ విచారణ( Hush Money Trial ) విషయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు( Donald Trump ) న్యూయార్క్ అప్పీల్ కోర్టులో చుక్కెదురైంది.ఈ కేసు విచారణను ఆలస్యం చేయాలన్న ట్రంప్ అభ్యర్ధనను న్యాయమూర్తి తోసిపుచ్చారు.

 Donald Trump Hush Money Trial New York Appeals Judge Rejects Request For Delay-TeluguStop.com

జ్యూరీ ఎంపిక ప్రారంభించడానికి ఒక వారం ముందు సోమవారం ఈ నిర్ణయం వెలువడింది.ట్రంప్ న్యాయవాదులు అత్యవసర విచారణను వాయిదా వేయాలని వాదించారు.

డెమొక్రాట్ల ఆధిపత్యం వున్న మన్‌హట్టన్( Manhattan ) నుంచి విచారణను మార్చాలని కోరుతున్నారు.2016, 2020లలో తాను గెలిచిన ఏకైక న్యూయార్క్ సిటీ బరో స్టేటెన్ ఐలాండ్‌కు( New York City Borough Staten Island ) విచారణను తరలించాలని ట్రంప్ కోరారు.మన్‌హట్టన్ జిల్లా అటార్నీ కార్యాలయానికి అప్పీలేట్ చీఫ్ స్టీవెన్ వు( Steven Wu ) మాట్లాడుతూ.విచారణను ఆలస్యం చేయాల్సిందిగా ట్రంప్ చేసిన అభ్యర్ధలను జడ్జి జువాన్ ఎం మెర్బన్ తిరస్కరించినట్లుగా చెప్పారు.

ఈ కేసు వాస్తవాలు, సాక్షులు మొదలైన వాటి గురించి లెక్కలేనన్ని మీడియా కథనాలు వెలువడుతున్నాయి.

Telugu Democrats, Donald Trump, Federal, Hush Trial, York, Yorkborough, Steven W

జస్టిస్ లిజ్ బెత్ గొంజాలెజ్ సోమవారం విచారణలో అప్పీల్ చేయలేదని పేర్కొన్నారు.అయితే అత్యవసర స్టే అన్నది డిఫెన్స్ కోరిక.సంబంధిత కోర్టు దాఖలును సమీక్షించి.

ఏదో ఒక సమయంలో నిర్ణయం తీసుకుంటానని లిజ్ అన్నారు.ట్రంప్ అప్పీళ్లకు సంబంధించిన పత్రాలు సీల్ కింద వుంచగా.

అవి బహిరంగంగా అందుబాటులో లేవు.ఏప్రిల్ 15న విచారణ ప్రారంభమవుతుందని మెర్చాన్ గత నెలలో తీర్పునిచ్చిన తర్వాత ట్రంప్ అప్పీల్ చేస్తానని చెప్పారు.

Telugu Democrats, Donald Trump, Federal, Hush Trial, York, Yorkborough, Steven W

ఈ విషయంపై ఫెడరల్ దర్యాప్తులో ఆలస్యంగా వచ్చిన సాక్ష్యాలను సమీక్షించడానికి మరింత సమయం ఇవ్వాలని ట్రంప్ న్యాయవాదులు కనీసం వేసవి వరకు విచారణను ఆలస్యం చేయాలని విజ్ఞప్తి చేశారు.సాక్ష్యం సమస్య కారణంగా విచారణను మార్చి 25న ప్రారంభ తేదీ నుంచి ఇప్పటికే తరలించిన మర్చన్.జాప్యం చేయాల్సిన అవసరం లేదన్నారు.ట్రంప్ తరపు న్యాయవాదులు సోమవారం తమ అప్పళ్లను రెండు వేర్వేరు కోర్టు డాకెట్లలో దాఖలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube