నోరు మూసుకో..బిడెన్ పై ట్రంప్ ఫైర్..వాడి వేడిగా ఇద్దరి మధ్య డిబేట్..!!!

అమెరికాలో త్వరలో జరగనున్న ఎన్నికల నేపధ్యంలో అధ్యక్ష బరిలో పోటీ పడుతున్న అభ్యర్ధులు ఇద్దరి మధ్య చర్చలు జరుగుతాయి.

ఇద్దరు పోటీ దారులు ఒకరిపై ఒకరు ప్రశ్నలు వేసుకుంటూ జరిగే ఈ చర్చ వేదిక ఆధ్యాంతం ఎంతో ఆసక్తిగా సాగుతుంది.

ప్రపంచం మొత్తం ఈ చర్చావేదికను కళ్ళప్పగించి మరీ చూస్తుంది.ఎవరి బలాలు ఎలా ఉన్నాయో ఈ వేదికపై జరిగే వాడి వేడి చర్చల ఆధారంగా పరిశీలకులు అంచనాలు వేస్తుంటారు కూడా.

తాజాగా జరిగిన ఈ చర్చలలో ట్రంప్, బిడెన్ ల మధ్య జరిగిన ఈ డిబేట్ కార్యక్రమం పీక్ స్టేజ్ కి వెళ్ళిందనే చెప్పాలి.ట్రంప్ ను దోషిగా అమెరికా ప్రజల ముందు నిలబెట్టాలని అనుకున్న బిడెన్ కి షాక్ ఇచ్చేలా ట్రంప్ సమాధానాలు ఇచ్చారని అంటున్నారు విశ్లేషకులు.

అసలు ఈ డిబేట్ ఎలా జరిగిందంటే.ఫ్యాక్స్ న్యూస్ ప్రతినిధి క్రిస్ వాలెస్ మోడరేటర్ గా ఈ డిబేట్ కు వ్యవహరించారు.

Advertisement

ఈ డిబేట్ లో ట్రంప్ కి సంధించిన మొదటి ప్రశ్న రిపబ్లిక్ పార్టీకి సానుభూతిపరురాలిగా ఉన్న బ్రారేట్ ను సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించడం పట్ల విమర్శలు వస్తున్నాయని ప్రశ్నించగా ఆమె న్యాయమూర్తిగా ఉన్నతమైన తీర్పులు ఇస్తారని, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా నిలబెట్టాము తప్ప ఎలాంటి స్వార్ధ ఆలోచన లేదని ట్రంప్ చెప్పారు.అయితే ఈ ప్రశ్న బిడెన్ ని ఇరకాటంలోకి నెట్టింది.

బార్రెట్ ఎంపికని ముందు నుంచీ బిడెన్ వ్యతిరేకిస్తుండగా ఈ వేదికపై మాత్రం ఆమె ఎంపికపై ఎలాంటి అభ్యతరం లేదని చెప్పడమే కాకుండా సో నైస్ పర్సన్ అంటూ కితాబు ఇచ్చారు.దాంతో ఈ విషయంలో ట్రంప్ పై చేయి సాధించినట్టు అయ్యింది.

రెండవ ప్రశ్న ఒబామా హెల్త్ కేర్ రద్దుపై అడిగారు.దీనిపై స్పందించిన ట్రంప్ తమ ప్రభుత్వం అంతకంటే ఎక్కువగానే కేర్ తీసుకుంటోందని, మందుల ధరలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయని అన్నారు.

కావాలనుకుంటే ఒబామా కేర్ పై మేము అందించే ప్రభుత్వం కేర్ పై ప్రజల అభిప్రాయం తీసుకోవచ్చని ధీటుగా బదులు ఇచ్చారు ట్రంప్.కరోనా విషయంలో ట్రంప్ అలసత్వం ప్రదర్శించడం వలన లక్షల మంది అమెరికన్స్ ప్రాణాలు పోగొట్టుకున్నారని బిడెన్ ఆరోపించారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

ఈ విషయంలో కూడా ట్రంప్ ధీటుగానే బదులు ఇచ్చారు.ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ దేశంలో లక్షల మంది ప్రజలు మృతి చెందారని, భారత్ లో కూడా మరణాలు సంభవించాయని, ఎలాంటి చర్యలు తీసుకున్నప్పటికీ మరణాలు ఆగలేదని, ప్రస్తుతం తాము తీసుకున్న చర్యల కారణంగానే మహమ్మారి తగ్గుముఖం పట్టిందని ట్రంప్ తెలిపారు.

Advertisement

కరోనా విషయంలో తాము ఎంతో మెరుగైన వైద్యం అందించామని, ఎక్కడా రాజీ పడలేదని అన్నారు.దాదాపు 90 నిమిషాల పాటు సాగిన ఈ కార్యక్రమంలో ట్రంప్ పై ఆరోపణలు చేస్తూ వెకిలి నవ్వులు నవ్వుతున్న బిడెన్ పై అసహనం వ్యక్తం చేసిన ట్రంప్ నోరు మూసుకో అంటూ మండిపడ్డారు.

తాజా వార్తలు