అమెరికా అధ్యక్ష ఎన్నికలు : అత్యున్నత పదవికి అనర్హుడంటూ కోర్ట్ సంచలన తీర్పు .. ట్రంప్ నెక్ట్స్ స్టెప్ ఏంటీ.?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో( US Presidential Elections ) ఈసారి ఎలాగైనా గెలవాలని భావిస్తోన్న డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.దేశ అత్యున్నత పదవికి ఆయన అనర్హుడని కొలరాడో సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది.

 Donald Trump Disqualified From Colorado's Presidential Primary Ballot , Constit-TeluguStop.com

రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిని నిర్ణయించే ప్రక్రియలో భాగంగా నిర్వహించే కొలరాడో స్టేట్ ప్రైమరీ బ్యాలెట్ ఎన్నికల్లో ఆయన పేరును చేర్చరాదని ధర్మాసనం వెల్లడించింది.వివరాల్లోకి వెళితే.2021 జనవరి 6న యూఎస్ కేపిటల్‌పై దాడి కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.

Telugu Capitol, Democratic, Donald Trump, Joe Biden, Republican, Presidential-Te

2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన డొనాల్డ్ ట్రంప్..కొత్తగా ఎన్నికైన డెమొక్రాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించేలా వ్యవహరించారని న్యాయస్థానం తేల్చింది.

ఈ నేరానికి గాను అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్ 3వ నిబంధన ప్రకారం ట్రంప్.రాజ్యాంగ పదవులకు అనర్హుడని ఏడుగురు సభ్యులతో కూడిన కొలరాడో సుప్రీంకోర్ట్ 4 – 3 మెజారిటీతో తీర్పును వెలువరించింది.

అయితే దీనిపై ఫెడరల్ సుప్రీంకోర్టులో అప్పీల్‌కు అవకాశం కల్పించింది.అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ .ట్రంప్‌కు ఈ తీర్పు శరాఘాతం వంటిదే అయినప్పటికీ పెద్దగా ప్రతిబంధం కాదని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.కొలరాడో సుప్రీంకోర్టు( Colorado Supreme Court ) ఇచ్చిన తీర్పు ఆ రాష్ట్ర పరిధి వరకు మాత్రమే చెల్లుబాటు అవుతోంది.

దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఈ తీర్పు వర్తించదు.దీనిపై ఇతర రాష్ట్రాల్లోని సుప్రీంకోర్టులు ఇలాంటి రూలింగ్ ఇస్తే మాత్రం ట్రంప్ ఇబ్బందుల్లో పడతారు.అయితే ఇలోగా ట్రంప్ .ఫెడరల్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం వుంది.

Telugu Capitol, Democratic, Donald Trump, Joe Biden, Republican, Presidential-Te

అయితే క్యాపిటల్ భవనంపై దాడికి( Capitol building ) డొనాల్డ్ ట్రంప్‌ను బాధ్యుడిని చేస్తూ కొలరాడోలోని ఓ డిస్ట్రిక్ట్ కోర్ట్ గతంలోనే ధ్రువీకరించింది.అయితే దీనికి ట్రంప్‌‌ను అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాల్సిన అవసరం లేదని పేర్కొంది.కానీ కొలరాడో సుప్రీంకోర్ట్ మాత్రం ఈ తీర్పును సవరించింది.రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిని నిర్ణయించే ప్రక్రియలో భాగంగా నిర్వహించే కొలరాడో స్టేట్ ప్రైమరీ బ్యాలెట్ పోరులో డొనాల్డ్ ట్రంప్ పేరును చేర్చరాదని ఆదేశించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube