గుంటూరు జిల్లాలో కుక్కలు బీభత్సం సృష్టించాయి.ఉదయాన్నే కరాటే తరగతులకు వెళ్తున్న ఆరేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడికి పాల్పడ్డాయి.
శునకాల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.
సెలవులు కావడంతో హైదరాబాద్ నుంచి బాలుడు గుంటూరులోని బంధువుల ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది.బాలుని తల్లిదండ్రులు హైదరాబాద్ లో ఉంటున్నారు.
అయితే గుంటూరు నగరంలో గత కొన్ని రోజులుగా కుక్కల సంచారంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.