నదులు, సముద్రాలు( Rivers, seas ) అప్పుడప్పుడు వాటి పరిధులను దాటి ఒక్కోసారి ముందుకు వస్తుంటాయి.అలలు పెద్దగా వచ్చి నీరు ఉన్నట్టుండి వరదలాగా జనవాసాల్లోకి దూసుకొస్తుంటుంది.
దానికి దగ్గరగా ఉన్నవారు ఆ నీటి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం.ఎందుకంటే అది వేగంగా దూసుకు వస్తుంది.
కారులో ఉన్నా సరే నలుమూలల నుంచి చుట్టుముట్టిన వరద నీటి నుంచి ఎస్కేప్ కావడం అంత ఈజీ ఏం కాదు.ఆ ఎస్కేప్స్ అనేవి ఓన్లీ సినిమాల్లోనే కనిపిస్తుంటాయి.
అయితే కొందరు మాత్రం ప్రజల్లో ఉన్న ఈ భావన తప్పు అని నిరూపిస్తుంటారు.వారు ఎలాంటి నీటి ముప్పు నుంచి అయినా ఈజీగా తప్పించుకోగలుగుతారు.
తాజాగా అలాంటి ఒక కారు డ్రైవర్ కి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

@Enezator ట్విట్టర్ పేజీ ఈ వీడియో క్లిప్ ను షేర్ చేసింది.సస్పెన్స్ థ్రిల్లర్ లా అనిపించినా ఈ వీడియోకి ఒక కోటి 24 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.ఈ వీడియో ఓపెన్ చేస్తే ఒక చోట చాలా కార్లు పార్కు చేసి ఉండటం కనిపించింది.
అదే చోటుకు ఎడమ వైపు నుంచి భారీగా నీరు తరలివస్తోంది.అప్పటికే ఒక కారును వరద నీరు దాటేసింది.దానిని క్రాస్ చేసి వెళ్లిపోవడం కారు వల్ల అయ్యే పని కాదు.

ఆ కారును ఇంకో వైపు నుంచి కూడా నీరు చుట్టుముట్టడానికి స్టార్ట్ చేసింది.ఆ సమయంలో డ్రైవర్ భయపడలేదు.ఒక చిన్న గ్యాప్ చూసుకొని కారును బాగా వేగంగా డ్రైవ్ చేస్తూ చివరికి ఎలాగోలా ఈ గండం నుంచి బయటపడ్డాడు.
అతడి స్థానంలో వేరే డ్రైవర్ ఉన్నట్లయితే సకాలంలో సరైన ఆలోచన చేసి ఉండేవాడు కాదు ధైర్యం కూడా చేసి ఉండేవాడు కాదు దీని వల్ల కారు వరదల్లో చిక్కుకొని కొట్టుకుపోయి ఉండేది.ఈ డ్రైవర్ స్కిల్స్( Driver skills ) చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ వలె ఈ కారు డ్రైవర్ బలే డ్రైవ్ చేశాడు అని మరికొందరు అంటున్నారు ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.







