మెగా డాటర్ నిహారిక ( Niharika ) ఈమధ్యనే తాను ప్రొడ్యూసర్ గా చేసే ఒక సినిమాకి సంబంధించిన పూజ కార్యక్రమాలు పూర్తి చేసింది.ఇక ఈ పూజా కార్యక్రమాల్లో కొత్త జంట అయిన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి(Varun Tej Lavanya Tripathi) ఇద్దరు పాల్గొని పూజను సక్సెస్ చేశారు.
ఇక నిహారిక ప్రొడ్యూసర్ చేయబోయే సినిమాకి చాలామంది కొత్తవారిని తీసుకున్నట్టు తెలుస్తోంది.ఇదిలా ఉంటే సినిమాకి సంబంధించి పూజ కార్యక్రమాల్లో నిహారిక సాంప్రదాయ బద్ధంగా చీర కట్టుకొని కనిపించింది.
ఇక చీరలో ఉన్న నిహారిక ఫోటోలు వైరల్ గా మారాయి ఇక అందులో ఒక ఫోటో ప్రస్తుతం చాలా వైరల్ గా మారుతుంది.
ఇక ఆ ఫోటోలో ఏముందంటే.
నిహారిక( Niharika ) వీపు పై టాటూ.( Tattoo ) నిహారిక తన వీపుపై ఒక టాటూ ను వేయించుకుంది.
ఇక ఆ టాటూ ని ఎందుకు వేయించుకుంది ఆ టాటూ అర్థం ఏంటి అనే సంగతి ఇప్పుడు తెలుసుకుంటే.నిహారిక వీపుపై ఉన్న టాటూ పక్షికి సంబంధించినది.
అయితే నిహారిక ఆ టాటూ పెళ్లయి విడాకులైన తర్వాత వేయించుకున్నట్టు తెలుస్తోంది.ఇక నిహారిక వేసుకున్న పక్షి టాటూ వెనుక అర్థం ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వినిపిస్తోంది.
అదేంటంటే నిహారిక ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నప్పటికీ పెళ్లయ్యాక తన లైఫ్ మొత్తం మారిపోయింది.అత్తింటి వాళ్ళు పెట్టే కండిషన్స్ కి తలొగ్గలేకపోయింది.దాంతో జొన్నలగడ్డ చైతన్య (Jonnalagadda Chaithanya) తో కలిసి ఉండలేక విడాకులు తీసుకుంది.ఇక విడాకుల తర్వాత నిహారిక కాస్త డిప్రెషన్ లోకి వెళ్లినప్పటికీ మళ్లీ తన ఫ్రెండ్స్ ఫ్యామిలీ వల్ల మామూలు స్థితి కి వచ్చేసింది.
అయితే విడాకుల తర్వాత నిహారిక ( Niharika ) తన వీపు పై పక్షి టాటూ( Bird Tattoo ) వేయించుకోవడానికి కారణం పెళ్లయ్యాక తన ఫ్రీడమ్ పోయింది అని పంజరంలో చిక్కిన పక్షి లాగా తన లైఫ్ మారిపోయిందని, కానీ ఎప్పుడైతే నిహారికకు విడాకులు వచ్చాయో ఆ తర్వాత ఫ్రీ బర్డ్ లాగా తన లైఫ్ ఉండాలనే ఉద్దేశంతోనే నిహారిక ఆ పక్షి టాటూ ను వేయించుకుంది అంటూ కొంతమంది ఆ టాటూ అర్థం ఇదే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.మరి నిహారిక వేసుకున్న ఆ టాటూ వెనుక అర్థం ఏంటో మాత్రం తెలియదు
.