రక్తం గడ్డ కడుతుందా.. రోజు వీటిని తింటే రక్తనాళాలలోని క్లాట్స్ కరిగిపోవాల్సిందే..!

ఈ మధ్యకాలంలో వయసులో సంబంధం లేకుండా క్షణాల్లోనే గుండెపోటుతో చాలామంది మరణిస్తూ ఉన్నారు.పోస్ట్ కోవిడ్ సమస్యలు దీనికి కారణమని కొందరు వైద్యులు చెబుతున్నారు.

కానీ ఒత్తిడి( Stress ), గంటల తరబడి ఒకే ప్లేస్ లో కూర్చొని పని చేయడం, అధిక బరువు, డయాబెటిస్, నిద్రలేమి కూడా గుండె పొటు కు కారణం కావచ్చు.అంతేకాకుండా శరీరంలో పలుచోట్ల రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడడం వల్ల కూడా హార్ట్ ఎటాక్ రావచ్చని నిపుణులు చెబుతున్నారు.

శరీరంలో మనకు తెలియకుండా ఏర్పడిన క్లాట్స్ ను ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల కరిగించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో వెల్లుల్లి ( Garlic )ప్రధాన పాత్ర పోషిస్తుంది.ఉదయాన్నే పరిగడుపున రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను నమిలి తినాలి.నేరుగా తినలేకపోతే తేనెలో కలిపి తినవచ్చు.

Advertisement

ఇలా తినడం వల్ల రక్త సరఫరా మెరుగుపడడంతో పాటు అక్కడ ఏర్పడిన రక్తపు గడ్డలు కూడా నిదానంగా కరిగిపోతాయి.అలాగే హై బీపీ కూడా తగ్గిపోతుంది.

రోజు ఒక కప్పు నల్ల ద్రాక్షను తినడం లేదా ఒక గ్లాసు ద్రాక్ష జ్యూస్( Grape Juice ) తాగడం అలవాటు చేసుకోవాలి.వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాల్లో ఏర్పడిన క్లాట్స్ ను కరిగిస్తాయి.

రోజు ఒక 60 ml రెడ్ వైన్ తాగితే క్లాట్స్ కరిగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.అయితే దీనిని ఆల్కహాల్ గా ఏమాత్రం పరిగణించకూడదు.

ఎందుకంటే ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కూడా గుండెను రక్షిస్తాయి.రోజు రాత్రి వేళలో ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలుపుకొని తాగితే రక్తనాళాల్లో ఏర్పడిన క్లాట్స్ కరిగిపోతాయి.

వైరల్ : కొడుకు కోసం ఆ తండ్రి బిర్యానీతో పడిన కష్టం.. ఎమోషనల్ స్టోరీ..
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 

రెండు పూటలా భోజనానికి ముందు ఒక టి స్పూన్ అల్లం రసం తీసుకుంటే రక్తనాళాల వాపును తగ్గిస్తుంది.అలాగే రక్తనాళాలలో అడ్డంకులు తొలగిపోతాయి.కివి, పైనాపిల్ పండ్ల తో పాటు పాలకూర వంటి ఆకులను ఆహారంగా తరచు తీసుకుంటూ ఉంటే క్లాట్స్ కరిగించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

Advertisement

తాజా వార్తలు