తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా ఇప్పుడు చక్రం తిప్పే స్థాయిలో ఉన్నాడు.కేసీఆర్ ఇంత రిలాక్స్ గా రాజకీయం చేయడం వెనుక ఆయన కుమారుడు కేటీఆర్ కృషి ఎక్కువగానే ఉంది.
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిండెట్ గా కేటీఆర్ సమర్ధవంతంగా పనిచేస్తుండడం కేసీఆర్ కి బాగా కలిసొస్తుంది.మొదటగా తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి వచ్చినా కేటీఆర్ అనతికాలంలోనే తానేంటో నిరూపించుకున్నాడు.
ఇప్పుడు తండ్రిని మించిపోయేలా కేటీఆర్ రాజకీయాల్లో పండిపోయాడు.లోక్‌సభ ఎన్నికల బాధ్యతను కేసీఆర్ తన మీద పెట్టిన తర్వాత ఆయన పూర్తి సమయం అంతా ముందుగా ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసుకున్నారు.
రోజుకు రెండు, మూడు చొప్పున.దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ చక్కెర్లు కొట్టేసాడు.
.ఎన్నికల సన్నాహ సభలను పూర్తి చేశారు.అందులో.పార్లమెంట్ ఎన్నికలు ఎంత కీలకమో.
ప్రజలకు అర్థమైన పదాలతో చెప్పారు.ఇవి లోక్‌సభ ఎన్నికలు కాబట్టి టీఆర్ఎస్కు ఏం సంబంధం అని.అంటున్న బీజేపీ, కాంగ్రెస్ నేతలకు ధీటైన సమాధానం ఇచ్చారు.ప్రజలకు పదహారు సీట్లివ్వాలని.
అప్పుడే దేశంలో తెలంగాణ గర్వంగా తలెత్తుకుంటుందని చెబుతున్నారు.ఇక ప్రజలను ఆకట్టుకోవడంలో కూడా కేటీఆర్ బాగా సక్సెస్ అయ్యాడు.
తెలంగాణ సామాన్య ప్రజలు ఎలా మాట్లాడుకుంటారో.అలానే కొనసాగిస్తారు.
ఈ విషయంలో కేసీఆర్ కు కేటీఆర్ పెద్ద అడ్వాంటేజ్ గా మారాడు.

టీఆర్ఎస్లో కేటీఆర్ స్పీడ్ ఇప్పుడు ఎవరూ అందుకోలేనంతగా ఉన్నారు.సిరిసిల్లలో మొదటి సారి 150 ఓట్ల తేడాతో గెలిచిన కేటీఆర్ మెజార్టీ ఇప్పుడు.ఇంచు మించు లక్ష.
అంతగా ప్రజాభిమానం పొందడం మాత్రమే.కాదు.
రాజకీయ వ్యూహాలను అమలు చేయడంలో.తన తర్వాత ఎవరైనా అనే స్థాయికి అనతికాలంలోనే ఎదిగిపోయారు.
పార్టీలో వరుసగా చేరుతున్న ఎమ్మెల్యేలు.ముందుగా వెళ్లి కేటీఆర్‌నే కలుస్తున్నారు అంటే ఆయన ప్రాధాన్యం ఏ రేంజ్ లో పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు.
ఇప్పుడు కేటీఆర్ ప్రధాన ద్రుష్టి అంతా పార్లమెంట్ ఎన్నికల మీదే పెట్టాడు.తెలంగాణాలో మొత్తం అన్ని స్థానాల్లో గెలుపొంది తన తండ్రికి గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నాడు.
కేసీఆర్ కి ఈ విషయంలో బాగా నమ్మకం పెరగడంతో ఆయన ఏపీ రాజకీయాల మీద ద్రుష్టి పెట్టి ఇక్కడి రాజకీయాల్లో వేలుపెడుతున్నాడు
.