అప్పుడు డేట్స్ లేవు.. ఇప్పుడు ఉన్నా అవకాశం లేదు.. పవన్ కళ్యాణ్ పరిస్థితి దారుణం అబ్బా!

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక వైపు సినిమాలు మరొకవైపు రాజకీయాలతో బిజీబిజీగా గడుపుతున్నారు.

 Doctors Advised To Stop The Campaign Pawan Decided To Continue Details, Pawan K-TeluguStop.com

ఎలక్షన్స్ సమయం దగ్గర పడుతుండడంతో రాబోయే ఎలక్షన్స్ లో ఎలా అయినా గెలవాలి అన్న పట్టుదలతో రాజకీయాలలో విరామం లేకుండా కార్యకలాపాలు సాగిస్తున్నారు.అలాగే మరొకవైపు ఆయన కమిట్ అయిన సినిమాలను కూడా పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఈ క్రమంలోని ఒక వైపు సినిమాలు,ఒకవైపు రాజకీయాలతో విరామం లేకుండా గడుపుతున్నారు.కాగా కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే.

వైరల్ ఫీవర్ బారిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఒక వారంలోనే కోరుకున్నారు.అయితే ఆ వైరల్ ఫీవర్ బారి నుంచి కోలుకున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఇంకా నీరసంగానే ఉన్నట్లు విశ్వసించిన వర్గాల నుంచి సమాచారం.

ఇంకొన్ని రోజులు విశ్రాంతి అవసరం అని డాక్టర్లు సూచించడంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.అందువల్లే ప్రజా సమస్యల దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు.

పవన్ కళ్యాణ్ హెల్త్ బాగా లేకపోవడంతో గత రెండు మూడు వారాలుగా ఆ కార్యక్రమం వాయిదా పడుతూనే వస్తుంది.దానికి తోడు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో వర్షాలు బాగా అధికంగా పడుతున్నాయి.

Telugu Doctors Advise, Harihara, Pawan Kalyan, Tollywood-Movie

వ్యవసాయ పనులు కూడా ఊపందుకున్నాయి.అందువల్ల ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలు చేపట్టినా కూడా జనం నుంచి అంత సానుకూల స్పందన ఉండదు.దీనితో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుని ఆరోగ్యం కుదుటపరుచుకునే పనిలో ఉన్నప్పుడు తెలుస్తోంది.మరొకవైపు సినిమా షూటింగ్ లు కూడా బంద్ అయిన విషయం తెలిసిందే.

పవన్ కళ్యాణ్ కమిట్ అయిన సినిమాలు కూడా అలానే ఉన్నాయి.అవి చేయడానికి కూడా పవన్ పరిస్థితులు ప్రస్తుతం అనుకూలంగా లేవు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు, భగవదీయుడు భగత్ సింగ్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube