రవికుమార్ గోనుగుంట దర్శకత్వంలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎస్ గురు ప్రసాద్( Guru Prasad ) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మహిషాసురుడు.( Mahishasurudu Movie ) ఇందులో రిచా కర్లా, ధరణి రెడ్డి హీరోయిన్లుగా నటించారు.
అనిరుధ్, అపరాజిత సమర్పణలో శ్రీ శివరామ ఆర్ట్స్ పతాకం పై ఈ సినిమాను నిర్మించారు.తాజాగా ఈ సినిమా ఆడియో ఫంక్షన్ బుధవారం హైదరాబాదులోని ఫిలిం ఛాంబర్ లో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ,రేలంగి నరసింహారావు,గౌతమ్ రాజులు విచ్చేశారు.
అనంతరం ఆడియోని వారి చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ సందర్బంగా ఈ సినిమా గురించి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గురు ప్రసాద్ మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా గురు ప్రసాద్ మాట్లాడుతూ.
ఒక 13 ఏళ్ల అమ్మాయికి గుండె మార్పిడి చేయాల్సి వచ్చింది.బ్లడ్ గ్రూప్స్, గుండె మ్యాచ్ అవ్వాలి.
ఆస్ట్రేలియా నుంచి తెప్పించాల్సి వచ్చింది.పేషెంట్ బతకాలంటే ఒక డివైస్ కావాలి.
రొబోటిక్ హార్ట్ పెట్టాలి.ఒక గుండె మార్పిడి చేయాలంటే కనీసం కోటి రూపాయలు ఖర్చు అవుతుంది.

చెన్నైలో ఆరుగురు పేషెంట్లకు అలాంటి ఖరీదైన హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశాము.కోటి రూపాయల డివైస్‌ను చూసి 5 లక్షలు ఇవ్వండి.ఐదేళ్లు బతికేలా డివైస్ తయారు చేసి ఇస్తాం అని హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్‌లో పనిచేసే నా ఫ్యామిలీ మెంబర్స్ అన్నారు అని చెప్పుకొచ్చారు గురు ప్రసాద్. ఈరోజు నేను మహిషాసురుడు సినిమా తీశానంటే మీరు వచ్చారు.
కానీ నేను రీసెర్చ్ తీసి హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ డివైస్ తీశానంటే మీరు రారు.గూగుల్‌లో నా ప్రొఫైల్ కొట్టి చూడండి వందల కొద్ది రీసెర్చ్ చేశాను.

కానీ నేను ఎవరో కూడా చాలామందికి తెలియదు.నేను మీకు యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా మాత్రమే తెలుసు.ఎందుకంటే నేను సినిమా తీశాను కాబట్టి.మీరు వేసుకొనే బీపీ ట్యాబ్లెట్స్ మేము రీసెర్చ్ చేసిందే.మా గైడ్ లైన్స్ ప్రకారమే ఆ ట్యాబ్లెట్లు తయారు చేశారు.కోవిడ్ తర్వాత పేషెంట్లకు ఏమౌతుందనే రీసెర్చ్ మేమే చేశాం.
ఇవన్నీ ఎవరు పట్టించుకొన్నాను.ఈ దేశంలో సినీ తారలు, స్పోర్ట్స్‌మెన్స్, అడల్ట్ స్టార్స్‌కు ఉన్న గుర్తింపు సైటింస్టులకు ( Scientists ) లేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గురు ప్రసాద్.







