MS Excel గురించి తెలియని జనాలు దాదాపు ఉండనే వుండరు.నేడు దాదాపు అందరూ దీనిని మీడియంగా చేసుకొని పనులు చేస్తున్నవారే.
Microsoft అందించే మేజర్ సర్వీసెస్ గురించి ప్రస్తావన అనవసరం.ఈ కంపెనీ అందిస్తున్న మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌లు తరచూ మీరు ఉపయోగిస్తుంటారు.
ఈ కంపెనీ ఎప్పటికప్పుడు ఆయా సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించి అప్‌డేట్‌లను కూడా అందిస్తుంటుంది.కాగా ఇప్పుడు MS OFFICE వంతు వచ్చింది.
ఇందులో ఓ కాంపోనెంట్ అయిన MS EXCELకి మైక్రోసాఫ్ట్ కొత్త ఫీచర్స్‌ని అనౌన్స్ చేసిందనే విషయం మీకు తెలుసా?
తెలియకపోతే ఇప్పుడు చూడండి.MS Excel అనేది విండోస్, ఆండ్రాయిడ్, iOS, మ్యాక్ OSలపై పని చేస్తుంది.
దీని ఆధారంగా క్యాలిక్యులేషన్స్, పివోట్ టేబుల్, గ్రాఫిక్ టూల్స్, మైక్రో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వంటి సదుపాయాలు మనం పొందుతున్నాం.ఇవి కాకుండా మరికొన్ని అదనపు ఫీచర్స్‌ని యాడ్ చేసినట్లు మంగళవారం మైక్రోసాఫ్ట్ కంపెనీ తాజాగా ప్రకటించింది.
అయితే ఈ అప్‌డేట్ WEB, MAC, WINDOWS వెర్షన్స్‌కు మాత్రేమే లభిస్తుంది.వీటిలో WEBకి అత్యధిక అప్‌డేట్స్‌ను కంపెనీ రిలీజ్ చేసింది.
ఈ కొత్త అప్‌డేట్‌లో భాగంగా ఎక్సెల్ షీట్‌లో టెక్స్ట్ కి బదులుగా సెల్స్‌లో ఫోటోలు వాడుకునే వెసులు బాటును కల్పించడం విశేషం. Formula by Example, Formula Suggestions, Suggested Links, Add Search Bar In Queries Pane వంటి ఇతర ఫంక్షన్లు అందించింది.ఈమధ్యనే వచ్చిన ఇమేజ్ టూల్ ఉపయోగించుకుని ఒక యూజర్ కంప్యూటర్ లోకేషన్‌ను సెలక్ట్ చేసుకుని సెల్స్‌లోకి ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు.అంతే కాకుండా ఈ టూల్స్‌లో ఉన్న ఇతర ఫంక్షన్స్ ఉపయోగించి ఇమేజెస్ ఫిల్టరింగ్, సోర్టింగ్, మూవింగ్ అండ్ రీసైజింగ్ కూడా తేలికగా చేయవచ్చు.
ఇతర వివరములకు సంబంధిత సైట్ చూడగలరు.