తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అటువంటి వారిలో ఘట్టమనేని ఫ్యామిలీ(Ghattamaneni Family)ఒకటి అని చెప్పాలి.ఈ కుటుంబం నుంచి కృష్ణ ( Hero Krishna ) ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి అనంతరం దర్శకుడిగాను నిర్మాతగాను ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక ఈయన వారసుడిగా మహేష్ బాబు కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా సక్సెస్ అందుకున్నారు.ఇలా మహేష్ బాబు (Mahesh Babu)తెరపై మాత్రమే కాకుండా తెర వెనక కూడా హీరో అనిపించుకున్నారు అనే విషయం మనకు తెలిసిందే.
ఇలా కృష్ణ నుంచి మొదలుకొని మహేష్ మిగతా ఘట్టమనేని కుటుంబ సభ్యులలో ఒక కామన్ క్వాలిటీ ఉందనీ చెప్పాలి.మరి వీరిలో ఉన్నటువంటి ఆ కామన్ క్వాలిటీ ఏంటి అనే విషయానికి వస్తే… దయ జాలి సాయం చేయడం అని చెప్పాలి.
కృష్ణ హీరోగా కొనసాగే సమయంలోను ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే వారికి తోచిన సహాయం చేస్తూ అండగా నిలిచేవారు.ఇదే అలవాటు మహేష్ బాబులో కూడా వచ్చింది.
ఈయన ఏకంగా మహేష్ బాబు ఫౌండేషన్ స్థాపించడమే కాకుండా ఎంతోమందికి సహాయం చేస్తూ గొప్ప మనసు చాటుకున్నారు.ముఖ్యంగా గుండె జబ్బులతో బాధపడే చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేస్తూ వారికి పునర్జన్మ ప్రసాదిస్తున్నారు.
ఇలా మహేష్ బాబు ఫౌండేషన్( Mahesh Babu Foundation ) ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

ఇక మహేష్ అడుగుజాడల్లోనే తన పిల్లలు సితార (Sitara ) గౌతమ్(Gautham)కూడా నడవడం విశేషం.సితార ఇదివరకు ఒక జువెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు.ఈ యాడ్ చేసినందుకు ఈమెకు కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వగా ఆ కోటి రూపాయలు చారిటీకి విరాళంగా ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారు.
అలాగే తన పుట్టినరోజు సందర్భంగా చారిటీలో ఉన్నటువంటి వారందరికీ సైకిళ్ళను కానుకగా ఇచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా గౌతమ్ కూడా మహేష్ బాబు ఫౌండేషన్ తో అనుసంధానమైనటువంటి ఆసుపత్రిలకు వెళ్లి అక్కడ తమ ఫౌండేషన్ ద్వారా లబ్ధి పొందినటువంటి చిన్నారులను కలిసి వారితో సమయం గడపడమే కాకుండా వారికి ఖరీదైన కానుకలు ఇచ్చి వారిని సంతోష పెట్టారు.ఇలా ఈ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కూడా ఇతరుల పట్ల జాలి దయ ప్రేమ అనే కామన్ క్వాలిటీ కలిగి ఉందని చెప్పాలి.







